YS Jagan : ఆ మీడియాను జనాలు నమ్మడం, చూడటం ఎప్పుడో మానేశారు
YS Jagan : సీఎం జగన్ పై మరియు ప్రభుత్వం పై ఎప్పుడు బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా పై జనాలకు కూడా అసహ్యం కలుగుతుందంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందుతున్న బియ్యం విషయంలో నానా రాతలు రాసిన ఎల్లో మీడియాకు వైకాపా నాయకులు సరైన సమాధానం ఇచ్చారు. గతంలో ఇచ్చిన రేషన్ బియ్యం కు ఇప్పటి రేషన్ బియ్యంకు ఉన్న తేడాను సాక్ష్యాధారాలతో సహా చూపించి ఎల్లో మీడియా యొక్క దురుద్దేశ్యం ను అందరికి తెలిసేలా చేశారు.
ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఆ మీడియా లో వచ్చిన వార్తలపై నిజ నిర్థారణ జరిగింది. బియ్యంలో మట్టి, రాళ్లు రావడంతో పాటు క్వాలిటీ లేకుండా నూకలు ఎక్కువగా వస్తున్నాయని ఆ మీడియా వారు కథనాలు రాయడంతో రంగంలోకి దిగిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ అసలు విషయాలను నిరూపించింది. మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం అంటూ వారు తేల్చారు. పూర్తిగా ప్రభుత్వం పై అక్కస్సును వెళ్లగక్కడం కోసం ఎల్లో మీడియా ఆ రాతలు రాసినట్లుగా ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిరూపితం అయ్యిందంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

YS Jagan ysrcp leaders fire on yellow media
తెలుగు దేశం పార్టీ నాయకులు ఏది మాట్లాడితే అదే గొప్ప అని.. ప్రభుత్వంను ఎలా విమర్శిస్తే అదే నిజం అన్నట్లుగా ఎల్లో మీడియా ప్రజెంట్ చేస్తుందంటూ వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులుగా తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు మరియు ఆరోపణలను కనీసం చెక్ చేసుకోకుండా ఎల్లో మీడియా జనాల ముందుకు తీసుకు వస్తుందని జనాలకు కూడా తెలిసింది. అందుకే గత కొన్నాళ్లుగా ఎల్లో మీడియాను జనాలు పూర్తిగా చూడటం మానేశారు. కనుక ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం కూడా వృదా అన్నట్లుగా వైకాపా ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.