షర్మిల కొత్త ఆలోచ‌న‌.. ఇది సక్సెస్‌ అయితే ఆమె మరో వైఎస్సార్‌ ఖాయం

0
Advertisement

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలాది మంది మృతి చెందుతున్నారు. ప్రతి రోజు ఎంతో మంది తమ కుటుంబ పెద్దను లేదా ఇంట్లో ఉద్యోగం చేసే వారిని కోల్పోతున్నారు. ఆ కారణంగా ఎన్నో కుటుంబాలు చిద్రం అవుతున్నాయి. ఈ సమయంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాల గురించి ఎవరు ఆలోచించడం లేదు. కనీసం వారికి సాయం చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. దాంతో ఆ కుటుంబాల్లో కొన్ని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరి కొందరు రోడ్డు పడుతున్నారు. ఈ సమయంలో అనాధలుగా మారిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు వైఎస్‌ షర్మిల సిద్దం అయ్యారు.

షర్మిల టోల్‌ ఫ్రీ నెంబర్‌..

YS Sharmila new idea to become like YSR
YS Sharmila new idea to become like YSR

కరోనా విపత్తు సమయంలో రోడ్డున పడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు గాను తమ వంతు సహకారంను అందించేందుకు గాను షర్మిల ముందుకు వచ్చారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ ను ఏర్పాటు చేసి తెలంగాణలో ఏ కుటుంబం అయితే కుటుంబ పెద్దను కోల్పోయారో వారికి సాయంగా నిలిచేందుకు సిద్దం అయ్యారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించడం లేదంటే వారికి ఆర్థికంగా సాయంగా నిలవడం వంటివి చేస్తారట. ఈ విషయంలో ఆమె ఇప్పటికే పలువురికి సాయంగా నిలిచారు. ఆమె ఆర్థిక సాయంతో చాలా కుటుంబాలు కాస్త ఊరట పొందుతున్నాయి. ఈ సమయంలో కుటుంబ పెద్దను కోల్పోయిన వారు జీవితాంతం ఇబ్బందులు గురి కావాల్సి ఉంటుంది. అందుకే షర్మిల వారికి మద్దతుగా నిలిచేందుకు సిద్దం అయ్యారు.

షర్మిల మంచి నిర్ణయం…

ఈ సమయంలో కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచేందుకు షర్మిల ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ఆమె ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలంటూ అభిమానులు ఆశ పడుతున్నారు. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దం అయ్యారు. ఇటీవలే ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సభకు మంచి స్పందన వచ్చింది. ఆమె రాజకీయ పార్టీ పెట్టినా కూడా తప్పకుండా ఆధరణ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఇలా సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడం వల్ల జనాల్లో షర్మిల కూడా వైఎస్సార్‌ మాదిరిగా జనాల కష్టాలు తెలిసిన మనిషి అంటూ గుర్తింపు దక్కించుకుంటారు. తద్వార రాజకీయంగా మంచి జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement