YS Sunitha : టీడీపీలోకి ముహూర్తం ఖరారయిందా? వైఎస్ సునీతకు చంద్రబాబు ఆహ్వానం పంపారా?
YS Sunitha : ఓవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పటికే సీబీఐ ఆయన హత్య కేసుపై చార్జిషీట్ దాఖలు చేయడంతో ఆ కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఓవైపు పోలీసులు, సీబీఐ వివేకానంద హత్య కేసుపై విచారణ జరుపుతుంటే.. ఆయన హత్య కేసు రాజకీయంగా కూడా పలు సంచలనాలు సృష్టిస్తోంది.అయితే.. వైఎస్ వివేకానంద హత్య కేసు విషయంలో తన సొంత జిల్లా ప్రజల నుంచే సీఎం జగన్ కు వ్యతిరేకత వస్తుండటాన్ని టీడీపీకి అవకాశంగా మార్చుకోవాలని చంద్రబాబు ఇటీవల కడప జిల్లా టీడీపీ నేతలతో సమావేశం అయినప్పుడు చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే కడపలో ఉన్న బడా టీడీపీ నేతలు.. వేరే పార్టీలకు వెళ్లిపోయారు. ఆదినారాయణరెడ్డి, రమేశ్ బీజేపీలో చేరారు. రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో కడప జిల్లాలో సరైన నాయకుడే లేడు. టీడీపీ నాయకుల కొరత కడప జిల్లాలో తీవ్రంగా వేధిస్తుండటంతో మంచి నేత కోసం చంద్రబాబు వెతుకుతున్నారు.వాళ్లకు ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక నేత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి. ఆమె తన తండ్రి హత్య కేసు విషయంతో చాలా సీరియస్ గా ఉన్నారు. తన తండ్రి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
జగన్ తోనూ తనకు ఇప్పుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో తనకు రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట.అందుకే తనకు టీడీపీ నుంచి ఆహ్వానం పంపించారట చంద్రబాబు. ఇప్పటికే సునీత అభిప్రాయం తెలుసుకునేందుకు చంద్రబాబు ఓ నేతను కూడా తన దగ్గరికి పంపించారట. అయితే.. తన చేరికపై మాత్రం ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. తను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.