Kadapa Politics : పొలిటికల్ వార్ – వైయస్ ఫ్యామిలీ వార్.. కడపకు పోటీగా వైఎస్ విజయమ్మ.. వైయస్ సౌభాగ్యమ్మ.. వైఎస్ సునీత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kadapa Politics : పొలిటికల్ వార్ – వైయస్ ఫ్యామిలీ వార్.. కడపకు పోటీగా వైఎస్ విజయమ్మ.. వైయస్ సౌభాగ్యమ్మ.. వైఎస్ సునీత

 Authored By aruna | The Telugu News | Updated on :31 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Kadapa Politics : పొలిటికల్ వార్ - వైయస్ ఫ్యామిలీ వార్.. కడపకు పోటీగా వైఎస్ విజయమ్మ .. వైయస్ సౌభాగ్యమ్మ .. వైఎస్ సునీత

Kadapa Politics : ఏపీలో ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో చెలరేగిపోతున్న వైఎస్ షర్మిల అటు పార్టీ క్యాడర్లో ఉత్సాహం కలిగించడంతోపాటు ఇటు వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కడపలో పర్యటించిన ఆమె అటు రాజకీయ అంశాలతో పాటు ఇటు కుటుంబ విషయాలను కూడా ప్రస్తావించారు. ఇదే సమయంలో తన ఐడెంటిటీ వైఎస్ బ్లడ్ అని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం, పోలవరం పూర్తయ్యే వరకు తాను ఏపీని వీడనని అన్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ లక్ష్యంగా కడప జిల్లాలో అన్నను టార్గెట్ చేయాలని వైయస్ షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడుతున్న వైఎస్ షర్మిల వైసీపీకి తన వల్ల అయినంత డామేజ్ చేయాలని మాత్రం భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

తాను కోస్తాంధ్ర ప్రాంతంలో పోటీ చేయాలని వైయస్ షర్మిల భావిస్తున్నారంట. ఫలితంగా ఆ ప్రాంతాల్లో తాను నేరుగా పోటీ చేయడం వలన ఆ ప్రభావం పక్కన ఉన్న కొన్ని నియోజకవర్గాలపై పడే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ఇక ప్రధానంగా కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ స్థానాలకు తన బాబాయ్ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నుంచి అవకాశం ఇవ్వాలని వైయస్ షర్మిల ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వైయస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీతను కడప లోక్ సభ స్థానానికి పోటీ పెట్టాలని వైయస్ షర్మిల ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్ వివేకానంద సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ ను బరిలోకి దింపాలని వైఎస్ షర్మిల ఆలోచిస్తున్నట్లు ప్రచారం మొదలైంది.

ఫలితంగా సొంత జిల్లాలోనే తన అన్న వైయస్ జగన్ కు షాక్ ఇవ్వాలని వైయస్ షర్మిల భావిస్తున్నారని అంటున్నారు. ఇదే జరిగితే తన కొడుకు కోసం వైఎస్ విజయమ్మ రంగంలోకి దిగిన ఆశ్చర్యం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో వైయస్ జగన్ దూత ఒకరు వైయస్ విజయమ్మతో మాట్లాడారని, ఇంట్లో వారు బయట వారు ఏకమై దాడి చేస్తున్న సమయంలో ఆమె సహాయ సహకారాలను ఆశిస్తున్నట్లు తెలిపారని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో వైఎస్ విజయమ్మ ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు అనేది తెర పైకి రాలేదు. ఏదేమైనా ఈసారి వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న వార్ కడప రాజకీయాలలో మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చివరికి ఎన్నికల నాటికి ఎవరి వ్యూహం ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా మారుతాయి అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది