బిగ్ బ్రేకింగ్ : బోరున విలపించిన ఎమ్మెల్యే రోజా?
ఎమ్మెల్యే రోజా ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో అందరికీ తెలుసు. తను ఏది మాట్లాడినా క్లారిటీతో మాట్లాడుతారు. ఎదుటివారిని గట్టిగా ప్రశ్నించే తత్వం. తనను కానీ.. వైసీపీని కానీ.. సీఎం జగన్ ను కానీ ఎవరైనా విమర్శిస్తే ఊరుకునే రకం కాదు. వాళ్ల తాట తీస్తారు రోజా. అటువంటి రోజా తాజాగా కంటతడి పెట్టారు. బోరున విలపించారు. అసలు ఏమైంది.. తెలుసుకుందాం పదండి..
ఎమ్మెల్యే అంటేనే వాళ్లకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్లకు ఇచ్చే మర్యాదను వాళ్లకు ఇవ్వాలి. లేకపోతే వాళ్ల పదవిని అవమానించినట్టే. తాజాగా ఎమ్మెల్యే రోజాకు అదే అనుభవం ఎదురైంది. ప్రోటోకాల్ ప్రకారం.. తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ రోజా మండిపడ్డారు. శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ముందు తన బాధను వెల్లగక్కారు.
గ్రూపు రాజకీయాలే కారణమా?
నిజానికి.. తనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి వైసీపీ పార్టీలోని గ్రూప్ రాజకీయాలే అనే అనుమానం కలుగుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని.. కావాలనే కొందరు నాయకులను పక్కన పెడుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ప్రోటోకాల్ ప్రకారం.. రోజాను పార్టీ కార్యక్రమాలకే కాకుండా.. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు కూడా పిలవాలి. కానీ.. తన సొంత నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగితే.. రోజాను పిలవకపోవడంతో.. ఆమె వెంటనే ప్రివిలేజ్ కమిటీని ఆశ్రయించారు.
దానికి సంబంధించిన విచారణలో భాగంగా ఆమె ప్రివిలేజ్ కమిటీ ముందు తాజాగా హాజరు అయి.. తన ఆవేదనను చెప్పుకున్నారు. తనకు ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పిలవడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం.. తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేలా కమిటీ చూడాలని ఆమె కోరారు.