YSRCP : అక్కడ వైసీపీకి ఎదురే లేదు.. కానీ ఎమ్మెల్యే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : అక్కడ వైసీపీకి ఎదురే లేదు.. కానీ ఎమ్మెల్యే…?

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 June 2021,5:10 pm

YSRCP : వైఎస్సార్సీపీ పార్టీకి ప్రస్తుతం ఏపీలో తిరుగు లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. మరో మూడేళ్ల దాకా ఆ పార్టీని టచ్ చేసే పార్టీ లేదు.. టచ్ చేసే మగాడు లేడు. అంతలా ఏపీలో పాతుకుపోయింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. అటూ ఇటూ కాకుండా ఉంది పరిస్థితి. అలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి కూడా అంతే. అందుకే.. మరో మూడేళ్ల వరకు ఏపీలో వైసీపీదే రాజ్యం. ఏపీలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వేరే పార్టీ పప్పులు ఉడకడం లేదు.

ysrcp sullurupeta mla kiliveti sanjeevaiah

ysrcp sullurupeta mla kiliveti sanjeevaiah

నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గాన్ని తీసుకున్నా కూడా అంతే. అక్కడ రెండు సార్లు వైసీపీ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. కిలివేటి సంజీవయ్య అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అయితే.. తన మామ పాపులారిటీతో సంజీవయ్య అక్కడ నెగ్గుకు వస్తున్నారు. ఆయన మామ పెంచలయ్య.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. 1989 లోనే అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మామ బాటలోనే నడుస్తూ.. 2013 లో సంజీవయ్య రాజకీయాల్లోకి వచ్చి.. వైసీపీలో చేరారు.

YSRCP : టీడీపీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకటరత్నయ్యను ఓడించిన సంజీవయ్య

వైసీపీలో 2013 లో చేరాక.. 2014 లో వైసీపీ నుంచి అక్కడ పోటీ చేసి.. టీడీపీలో మూడు సార్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరత్నయ్యను ఓడించి.. చరిత్ర సృష్టించారు సంజీవయ్య. 2019 లోనూ అంతే. టీడీపీని 2019 లో ఘోరాతి ఘోరంగా ఓడించారు. 73 వేల ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచి సత్తా చాటారు సంజీవయ్య. అయితే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. వైసీపీకి అక్కడ ప్రాధాన్యం ఉంది తప్పితే.. ఆయన దూకుడు మాత్రం అంతగా లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ysrcp sullurupeta mla kiliveti sanjeevaiah

ysrcp sullurupeta mla kiliveti sanjeevaiah

టీడీపీ నుంచి రెండు సార్లు ఓడిపోయినా కూడా వెంకటరత్నయ్య ఇంకా యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. ఏది ఏమైనా.. వైసీపీకి ఉన్నంత పాపులారిటీ టీడీపీకి లేదు. వెంకటరత్నయ్య వయసు కూడా మీద పడటంతో ఆయన త్వరలోనే రాజకీయాలకు గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి వెంకటరత్నయ్య పోటీ చేయకపోవచ్చని.. వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఈనేపథ్యంలో సూళ్లూరుపేటలో వైసీపీకి మరోసారి కూడా తిరుగులేదని.. ఇక్కడ మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయం అని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

ఇది కూడా చ‌ద‌వండి ==> TTD CHAIRMAN : వైవీకి ప్ర‌మోష‌న్‌.. టీటీడీ కొత్త చెర్మన్ గా ఎవరు…?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : ఆ జిల్లా 10 మంది ఎమ్మెల్యేలపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : ఎమ్మెల్సీలుగా ఈ నలుగురిని ఫైన‌ల్ చేసిన వైఎస్ జగన్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : వైఎస్సార్సీపీలో మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకొనేవారే లేరా..?

 

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది