Allu Arjun : అక్కడ మొదలైంది ఇక్కడిదాకా తెచ్చింది.. అల్లు అర్జున్ 11th బ్యాడ్ సెంటిమెంట్..!
ప్రధానాంశాలు:
Allu Arjun : అక్కడ మొదలైంది ఇక్కడిదాకా తెచ్చింది.. అల్లు అర్జున్ 11th బ్యాడ్ సెంటిమెంట్..!
Allu Arjun : పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే అల్లు అర్జున్ మాత్రం అసలేమాత్రం సంతోషంగా లేడు అన్నది తెలిసిన విషయమే. పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన తొక్కిసలాట వల్ల రేవతి అనే మహిళ మృతి చెందడం ఆ టైం లో అల్లు అర్జున్ థియేటర్ విజిట్ చేయడం వల్లే అది జరిగిందని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఐతే మధ్యంతర బెయిల్ తో అల్లు అర్జున్ ఒక పూట మాత్రమే జైలులో ఉండి రిలీజ్ అయ్యాడు. ఐతే ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసి అల్లు అర్జున్ విషయంలో 11 అనేది బాగా వెంటాడుతుందని అంటున్నారు. అలా ఎందుకు అంటే ఏపీ ఎన్నికల నేపథ్యంలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవికి తన మద్ధతు తెలిపాడు. అది మే 11నే అవ్వడం విశేషం. నంద్యాల మే 11న వెళ్లి అల్లు అర్జున్ బాగా నెగిటివిటీ ఫేస్ చేసిన విషయం తెలిసిందే. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట లో రెవతి కూడా 11 గంటల టైం లోనే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారని సమాచారం..
Allu Arjun చిక్కడపల్లి పోలీసులు ఉదయం 11 గంటలకు..
ఈ కేసులో అల్లు అర్జున్ ని A 11గా ఉన్నారు. అంతేకాదు రెండోసారి ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చ్ హెప్పారు. ఇవన్నీ దేనికవే సంబంధం లేకుండా యాదృశ్చికంగా జరిగినా 11 నంబర్ అల్లు అర్జున్ కి కలిసి రాదని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఈ కేసులో అల్లు అర్జున్ సైడ్ నుంచి మొదటి నుంచి ఒకటే మాట వినిపిస్తున్నా పోలీసులు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ఇష్యూలో ఎఫ్.డి.సీ చైర్మన్ దిల్ రాజు కీలక పాత్ర వహిస్తున్నారు. ఆయన అటు పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పగా నేడు శ్రీ తేజ్ ని చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లి అల్లు అరవింద్ 2 కోట్లు ఆ ఫ్యామిలీకి దిల్ రాజు ద్వారా అందించారు. Allu Arjun, Pushpa 2, Allu Arjun 11 Sentiment, Dil Raju