ఒక్క వీధిలో 2 రాష్ట్రాలు , 2 నియోజకవర్గాలు…ఎక్కడంటే..!!
కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు వింటే ఇది నిజమేనా అన్న భావన కలుగుతుంది. ఇక అలాంటి విచిత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక చివరగా ఉన్న అరకు ఎంపీ నియోజకవర్గం అలాగే తెలంగాణలో మరో కొసకు ఉండే మహబూబాద్ లోక్ సభ నియోజకవర్గం. అయితే రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ఒక వీధి ఉంది అంటే మీరు ఊహించగలరా..?తెలంగాణలో ఒక వీధిలో ,ఒకవైపు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే అరకు లోక్ సభ నియోజక వర్గం పరిధిలో రావటం సీత్రమనే చెప్పాలి.
ఖమ్మం లోని భద్రాచలం…
అయితే ఇదంతా మనం ఖమ్మం జిల్లా భద్రాచలం లోని రాజుపేట లో చూడవచ్చు. అయితే ఉమ్మడి రాష్టం గా ఉన్నపుడు ఒకే వీధిలో ఒకవైపు మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గం మరోవైపు అరకు ఎంపీ నియోజకవర్గం ఉండేది. అదే సమయంలో రాజపేటకు చెందిన శీలం శ్రీనివాస అనే వ్యక్తి ఇల్లు నిర్మాణం చెప్పటారు. ఇక ఆయన ఇల్లు నిర్మాణం పూర్తి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర విభజన జరగడంతో శ్రీనివాస్ ఇల్లు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఎంపీ స్థానం రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం లోని పరిధిలోకి వెళ్ళిపోయింది…
అయితే రాజుపేట నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు దాదాపు 270 కి.మీ. దూరం లో ఉండడం విశేషం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే … శ్రీనివాస్ కు జానకిరామ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. జానకిరామ్ కొన్ని రోజుల క్రితం తన తండ్రి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసాడు. అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాడు. అయితే తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత జానకీరామ్ ఇల్లు మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసింది. ఇక ఆయన తండ్రి శ్రీనివాస్ ఇల్లు అరకు నియోజకవర్గం పరిధిలోకి వెళ్ళిపోయినది. అంటే తండ్రి ఉండేది ఆంధ్రప్రదేశ్ లోని అరకు నియోజకవర్గ అయితే కొడుకు ఉండేది మాత్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో అన్నమాట. అంటే వాళ్ళు 4 అడుగులు వేస్తే చాలు ఏపీ నుండి తెలంగాణ , తెలంగాణ నుండి ఏపీ కి వెళ్ళిపోతారు. బలేగా ఉంది కదా…