BJP : ఈ దెబ్బతో ఏపీలో కమలం మళ్లీ వాడిపోవడం ఖాయం, మరి పవన్ పరిస్థితి ఏంటీ?
BJP : ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార వైకాపా ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు కొత్త కూటమిగా ఏర్పాటు అయిన బీజేపీ మరియు జనసేన పార్టీలు జనాలకు కొత్త పరిపాలన అందిస్తామని చెబుతున్నారు. బీజేపీ పై ఉన్న నమ్మకంతో జనసేన పొత్తుకు సిద్దం అయ్యింది. తీరా చూస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ పలు వివాదాస్పద నిర్ణయాలతో ఏపీలో బోలెడంత వివాదాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ఏపీలో బీజేపీ అంటేనే మండి పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణకు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ బీజేపీని ఏపీలో మళ్లీ జనాలు పక్కకు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది.
BJP : బీజేపీతో ఉంటే జనసేనకు కష్టం..
ఏపీలో గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయం తీవ్రంగా చర్చకు వచ్చి బీజేపీ ని జనాలు నమ్మలేదు. దాంతో వారికి కనీసం స్థానాలను కూడా ఇవ్వలేదు. అయినా కొత్త నాయకత్వంను ఏర్పాటు చేసి బీజేపీ మళ్లీ ఏపీలో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేసిన తర్వాత వరుసగా ఏపీలో బీజేపీ కి మంచి జరిగింది. జనసేన మరియు బీజేపీ కలిస్తే అద్బుతాలు ఆవిష్కరిస్తాం అన్నట్లుగా ప్రచారం చేశారు. జనాలు కూడా కాస్త నమ్మారు. ఇలాంటి సమయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం జనసేనకు ఇబ్బందిగా మారింది. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కష్టం అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
BJP : ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు
ఏపీలో బీజేపీ రాజకీయం ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా పరిస్థితి ఉంది. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో నిలదొక్కుకునే పరిస్థితుల్లో ఉన్న సమయంలో విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయడం వల్ల రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర నాయకులకు కూడా ఈ విషయం మింగుడు పడటం లేదు. దాంతో వారు ఇప్పుడు పక్క పార్టీల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో జనసేన ఇంకా కూడా బీజేపీతో దోస్తీ కోరుకుంటూ మాత్రం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుగా అవుతుందని ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.