Anam Venkata Ramana Reddy : రోజాకి సపోర్ట్ చేస్తున్న పతివ్రతలకు ఒకటే చెబుతున్నా.. ఏం పీకుతారో పీక్కోండి
Anam Venkata Ramana Reddy : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ గురించి పక్కన పెడితే రోజా, బండారు కాంట్రవర్సీ కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బండారు చేసిన వ్యాఖ్యలు చివరకు సినీ ఇండస్ట్రీకి పాకాయి. రోజా నువ్వెంత నీ బతుకెంత అని బండారు చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా కుదేలైంది. ఒక సినీ నటిని పట్టుకొని ఆ సినిమాల్లో యాక్ట్ చేశావు.. ఈ సినిమాల్లో యాక్ట్ చేశావు అని బెదిరిస్తావా అని పలువురు సీనియర్ నటీమణులు బండారు సత్యనారాయణపై మండిపడ్డారు. తాజాగా ఇదే కాంట్రవర్సీపై టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి స్పందించారు. 22 షెల్ కంపెనీలు సాక్షిలో పెట్టుబడులు పెట్టాయని నేను చెప్పడం లేదు సీబీఐ చెబుతోంది. 22 కంపెనీలు 195.7 కోట్లు సాక్షిలో పెట్టుబడులు పెట్టాయని సీబీఐ రిపోర్ట్ చెబుతోంది. అవి కూడా ఇక్కడి కంపెనీలు కావు.. అన్నీ హౌరా, కలకత్తా, ముంబై, ఢిల్లీకి చెందిన కంపెనీలు.. అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇందులో 90 శాతం కంపెనీలు షెల్ కంపెనీలే. కేవలం జగన్ మోహన్ రెడ్డి సాక్షి పెట్టుబడుల కోసం సృష్టించిన కంపెనీలు ఇవి. ఎవరు ఆర్థిక ఉగ్రవాది చెప్పండి ఇప్పుడు. మాట్లాడుతున్నారు కదా మంత్రులు. మా రోజమ్మా.. చెప్పమ్మా సమాధానం. 22 షెల్ కంపెనీల నుంచి మీ నాయకుడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని దొంగ సొమ్ము సాక్షిలో పెట్టారా లేదా అని అడుగుతున్నా. దాని గురించి మాట్లాడరు కానీ.. చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాది అని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి, ఆయన భార్య వైఎస్ భారతి ఇద్దరి పేర్లు సీబీఐలో ఉన్నాయి. వేల కోట్ల అవినీతి చేశారు. ఎవరి సొమ్ము ఇది. జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది, వైట్ కాలర్ క్రిమినల్. దొంగ డబ్బు. అందుకే కోర్టుకు వెళ్లాలంటే జగన్ భయపడుతున్నాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంక్వైరీలు చేసి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది.

#image_title
Anam Venkata Ramana Reddy : మహిళల్లా ప్రవర్తించే మహిళలకే మేము రెస్పెక్ట్ ఇస్తాం
ఖుష్బూ, రాధిక.. వీళ్లు రోజాకు మద్దతు ఇచ్చారు. కానీ.. వీళ్లకు మేము చెప్పేది ఒక్కటే.. మహిళలకు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ.. మహిళల్లా ప్రవర్తించే మహిళలకే మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఎవరినైనా సపోర్ట్ చేసేటప్పుడు అసలు ఏం జరిగింది.. ఏంటో తెలుసుకొని మద్దతు ఇవ్వండి. ఆ వీడియోలను మీరు విత్ డ్రా చేసుకోండి. మీరంతా మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. రోజా లాంటి వ్యక్తిని సపోర్ట్ చేసి మిమ్మల్ని మీరు డీగ్రేడ్ చేసుకోకండి.. అని ఆనం హితవు పలికారు.