Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం...!

Free Bus Scheme : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకం అక్కడ బాగా సక్సెస్ అవడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా దానిని అమలు చేశారు. అయితే ఇక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ పథకాన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాలలో దానిని కూడా చేర్చారు. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు. కావున ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి జూన్ 12న అధికారంలోకి రావడం జరిగింది. అంటే కూటమి అధికారం సాధించి రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఈ తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాలు అమలుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Free Bus Scheme ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌ జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం

Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం…!

దీంతో ఈ సమస్యలు రాకుండా ముందుగానే పరిష్కరించేందుకు దీనిపై దృష్టి సారించినట్లుగా రవాణా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అయితే ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రధానంగా ఆటో డ్రైవర్లు తమకు గిరాకీ రావట్లేదని ఆందోళనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున దానికి ప్రత్యమ్నయంగా మరోపక్కని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలియజేశారు. అలాగే ఈ పథకాన్ని అమలు చేసిన తర్వాత రాష్ట్రానికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని తెలిపారు. తద్వారా ప్రతినెల 90 నుంచి 100 కోట్ల వరకు భారంపడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు. అయినప్పటికీ ఈ పథకాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. దీంతో జూలై 1 నుంచి దీనిని అమలు చేయబోతుందని తెలుస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది