Free Bus Scheme : ఉచిత బస్సు పథకంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు… బస్సు ఎక్కేవారు ఇది కట్టాల్సిందే…!
ప్రధానాంశాలు:
Free Bus Scheme : ఉచిత బస్సు పథకంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... బస్సు ఎక్కేవారు ఇది కట్టాల్సిందే...!
Free Bus Scheme : కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మల సీతారామన్ తమ సంచలన నిర్ణయాన్ని తెలిపారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాలు హామీల గురించి తెలిపారు. ఈ తరుణంలో మహిళల అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం పై ఆమె మాట్లాడారు. అయితే ఈ ఉచిత పథకాలను ప్రజలే అమలు చేయాలి అని అలాగే రాబోతున్న కాలానికి ఇది భారం కాకూడదు అని అన్నారు. ఈ తరుణంలో నిర్మల సీతారామన్ ఉచిత బస్సు పథకం అమలులో ఉన్నటువంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను గుర్తు చేశారు. అయితే మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ ఉచిత పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మల సీతారామన్ ముఖ్య విషయాలు తెలిపారు. ఆయా రాష్ట్రాలలోని ఇతర వర్గాల కోసం ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఉచిత పథకాలకు స్థిరత్వం తీసుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది అని నిర్మల సీతారామన్ ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ తరుణంలో దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆమె తెలిపారు. ఇటువంటి ఉచిత పథకాలను అమలు చేయడం వలన భావితరంపై భారం పడవద్దు అని తెలిపారు. అయితే ఎన్నికలలో గెలవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజలకు హామీ ఇచ్చే ఉచిత పథకాలకు మద్దతు అనేది ఇవ్వొచ్చు కానీ ప్రజల అభిప్రాయం మేరకు పన్ను చెల్లించే వారికి జవాబు దారిగా ఉండి తీరాలి.
ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి నగదు బదిలీ పథకం, ఉచిత బస్సు ప్రయాణం గురించి మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడారు. అయితే గత సంవత్సరం చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చి ఉచిత బస్సు పథకంతో పాటుగా మరో ఐదు హామీలను కూడా ఇచ్చింది అని ఆమె గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఏమీ జరుగుతుందో చూడండి. అభివృద్ధి పనులు చేయటానికి డబ్బులు లేవు అని చెప్పకుండా ముందు ఎన్నికలలో ఇచ్చిన హామీలను గౌరవించాలి అని అంటున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం వలన అదే టైంలో పురుషులకు బస్సు చార్జీలు అనేవి పెంచడం ఆ కుటుంబాలకు మరింత భారం అవుతుంది అని ఆమె తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత పథకాలపై నిజాయితీగా చర్చ జరగాలి అని ఆమె పిలుపు ఇచ్చారు. ఈ ఉచిత పథకాలపై ఆయా ప్రభుత్వాలు కూడా నిజాయితీగా చర్చలు అనేవి జరపాలి అని ఆమె అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఉచిత పథకానికి ఏమాత్రం పొంతన లేదు అని ఆమె అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలను ఆదుకోవాలి అన్నారు. అయితే ఈ ఉచిత పథకాలకు మరియు సంక్షేమ పథకాలకు తేడా చెప్పటం చాలా కష్టం అని సుప్రీంకోర్టు తరచుగా చెబుతూ ఉంటుంది అని ఆమె తెలిపారు. ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు కొంతమంది దగ్గర నుండి పన్ను వసూలు చేసి కొంతమందికి పంపిణీ చేస్తున్నారు అని అన్నారు. అయితే నిజమైన అర్హులు మాత్రమే ఉచిత ప్రణాళికను పొందాలి అని అంటున్నారు. అయితే ఏది ఏమైనా ప్రజల నుండి పన్ను రూపంలో వచ్చేటటువంటి ఆదాయం నుండి తాగునీరు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్య మరియు విద్య రంగాలకు సరిపడే నిధులను ప్రభుత్వం కేటాయించాలి అని ఆమె తెలిపారు. అయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఉచిత పథకాల వలన ఎవరైనా లబ్ది పొందవచ్చు అని అన్నారు. అయితే పన్ను చెల్లించే వారిపై ప్రతికూల ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఆమె స్పష్టంగా తెలిపారు…