Heavy Rains : మరో తుఫాన్ హెచ్చరిక.. ఏపీ తెలంగాణాల్లో రానున్నమూడు రోజులు భారీ వర్షాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heavy Rains : మరో తుఫాన్ హెచ్చరిక.. ఏపీ తెలంగాణాల్లో రానున్నమూడు రోజులు భారీ వర్షాలు..!

Heavy Rains : ఇప్పటికే గత వారం రోజులుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా ఇప్పుడు మరో తుఫాన్ హెచ్చరిక ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు నమోదు కాగా ఎప్పుడు జరగనంత ఆస్తి నష్టం జరిగింది. ఎటు చూసినా సరే వరద నీరు ప్రజల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐతే నేటితో తిఫాన్ ముగిసింది అనుకుంటే మరో పిడుగు లాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 September 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Heavy Rains : మరో తుఫాన్ హెచ్చరిక.. ఏపీ తెలంగాణాల్లో రానున్నమూడు రోజులు భారీ వర్షాలు..!

Heavy Rains : ఇప్పటికే గత వారం రోజులుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా ఇప్పుడు మరో తుఫాన్ హెచ్చరిక ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు నమోదు కాగా ఎప్పుడు జరగనంత ఆస్తి నష్టం జరిగింది. ఎటు చూసినా సరే వరద నీరు ప్రజల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐతే నేటితో తిఫాన్ ముగిసింది అనుకుంటే మరో పిడుగు లాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. ఈ నెల 5న బంగళ్లా ఖాతం లో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

దాని వల్ల మరో 3, 4 రోజులు రెండు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. కురుస్తున్న వర్షాల వల్ల ఏపీలో కొన్ని జిల్లాలు, తెలంగాణాలో కొన్ని జిల్లాలు మొత్తం నీటి మయం కాగా రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ఏపీలో ఈ అల్ప పీడనం వల్ల కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, గుంటూరు, యానాం, బాపట్ల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ చేస్తున్నారు.

Heavy Rains ఏపీ, తెలంగాణా ప్రజలకు మరో తుఫాన్ అలర్ట్..

ఇక తెలంగాణాలో అటు ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజిగిరి, సిద్ధిపేట్, మెదక్ల్ సంగారెడ్డి, జగిత్యాల లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ కాగా ముదంద్స్తు చర్యలు చేపట్టేలా ముంపు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టేలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.

Heavy Rains మరో తుఫాన్ హెచ్చరిక ఏపీ తెలంగాణాల్లో రానున్నమూడు రోజులు భారీ వర్షాలు

Heavy Rains : మరో తుఫాన్ హెచ్చరిక.. ఏపీ తెలంగాణాల్లో రానున్నమూడు రోజులు భారీ వర్షాలు..!

ఏపీలో భారీ వర్షాల వల్ల విజయవాడ నీటమునిగింది.. ఇటు తెలంగాణాలో ఎప్పుడు లేని విధంగా మున్నేరు వాగు పొంగి ఆ పక్కన అంతా జలమయం అయ్యింది. ఖమ్మం లో ఈ స్థాయిలో వర్షాలు పడం వాగులు ఇలా రోడ్ల మీదకు రావడం చాలా అరుదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది