Chandrababu : చంద్రబాబుకు బిగ్ షాక్.. మరో 10 రోజులు రిమాండ్ పొడిగింపు.. ఇక బయటికి వచ్చే చాన్స్ లేనట్టేనా?
Chandrababu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను మరో 10 రోజులు పెంచారు. చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. ఇప్పటికే ఆయనకు రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. ఈ రెండు రోజులు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించారు. ఆయన కస్టడీ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో వర్చువల్ గా చంద్రబాబును ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు […]

Chandrababu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను మరో 10 రోజులు పెంచారు. చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. ఇప్పటికే ఆయనకు రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. ఈ రెండు రోజులు సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించారు.

#image_title
ఆయన కస్టడీ ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో వర్చువల్ గా చంద్రబాబును ప్రవేశపెట్టారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టారు. ఈనేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ పొడిగించాలంటూ సీఐడీ అధికారులు కోరారు. దీంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే విచారణ
అయితే.. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి రాజమండ్రి జైలుకు తరలించి అక్కడి నుంచే వర్చువల్ గా న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తున్నారు. చంద్రబాబును కోర్టుకు తీసుకెళ్లకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతున్నారు. ఈనేపథ్యంలో రిమాండ్ విచారణపై కూడా చంద్రబాబును వర్చువల్ గానే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జడ్జి ఎదుట హాజరు పరచారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు ముగియడంతో.. ఆయన రిమాండ్ ను పొడిగించాలని సీఐడీ అధికారులు కోరడంతో అక్టోబర్ 5 వరకు కోర్టు పొడిగించింది.