Ayyanna Patrudu : కొజ్జా అన్న వైయస్ షర్మిలను వైయస్ జగన్ చంపేస్తాడు – అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ayyanna Patrudu : కొజ్జా అన్న వైయస్ షర్మిలను వైయస్ జగన్ చంపేస్తాడు – అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు..!

Ayyanna Patrudu : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైయస్సార్ సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైయస్ జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా ఉండదు. వాళ్ళ బాబాయ్ ని చంపేసి చంద్రబాబునాయుడు చంపాడని చెప్పే దుర్మార్గుడు అని అన్నారు. తన చెల్లి వైయస్ షర్మిలను కూడా చంపేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడికి చెల్లి బాబాయ్ అని తేడా ఉండదు. ఇక […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ayyanna Patrudu : కొజ్జా అన్న వైయస్ షర్మిలను వైయస్ జగన్ చంపేస్తాడు - అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు..!

Ayyanna Patrudu : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైయస్సార్ సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైయస్ జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా ఉండదు. వాళ్ళ బాబాయ్ ని చంపేసి చంద్రబాబునాయుడు చంపాడని చెప్పే దుర్మార్గుడు అని అన్నారు. తన చెల్లి వైయస్ షర్మిలను కూడా చంపేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడికి చెల్లి బాబాయ్ అని తేడా ఉండదు. ఇక తన చెల్లి వైయస్ షర్మిలకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తిలో వాటా ఉందని, ఆ ఆస్తులు చేజారి పోతాయని వైయస్ జగన్ తన చెల్లిని దూరం పెట్టారని అన్నారు.

ఇక వైఎస్ షర్మిలా కూడా తన అన్నకు ధీటుగా మాట్లాడుతున్నారు. ఇటీవల సిపిఎస్ కూడా రద్దు చేయని కొజ్జా కొడుకులను కొజ్జా అనకపోతే ఏమంటారు జగనన్న అని వైయస్ షర్మిల అన్న డైలాగ్ అదిరిందని అన్నారు. ఆమెను కూడా వైయస్ జగన్ తన బాబాయ్ ను చంపినట్లుగా చంపుతాడని, ఆమెకు సెక్యూరిటీని పెంచాలని అన్నారు. ఇక నన్ను కూడా చంపేస్తామని వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని భావించి రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎస్పీ గన్మెన్ ఇస్తామని చెప్పారని కానీ వద్దని తానే చెప్పానన్నారు. ఎందుకంటే తాను ఎక్కడ ఉన్నానో వారే ఉప్పందిస్తారని భయం తనకు ఉందన్నారు.

వైయస్ జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా ఉండదు. అలాంటిది అయ్యన్నపాత్రుడు ఒక లెక్కా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ తెస్తానని, అమరావతి రాజధాని అన్నారని, ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారుష అసలు ఏదీ జరగలేదని అన్నారు. పోలీసులతో తప్పుడు పనులు చేయించారని పోలీసులను కూడా మోసం చేశారన్నారు. ఇక అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు విజయ్ దరఖాస్తు చేసుకున్నారని అధిష్టానం పరిశీలన చేస్తుందని అన్నారు. విజయ్ మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ దగ్గర రెండేళ్లు శిక్షణ పొందారని, అన్ని విధాలుగా చూస్తే విజయ్ సమర్థుడు అన్నారు. తన కుమారుడిని ఆదరించాలని కోరారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక