Ys Jagan : ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్ జగన్ లో పెను మార్పు… ఇకపై ఇలాగే ఉంటుందా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్ జగన్ లో పెను మార్పు… ఇకపై ఇలాగే ఉంటుందా…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్ జగన్ లో పెను మార్పు... ఇకపై ఇలాగే ఉంటుందా...?

Ys Jagan : కొన్నిసార్లు మన జీవితంలో జరిగే కొన్ని చేదు జ్ఞాపకాలు మనిషిలో సరికొత్త మార్పులను తీసుకువస్తాయి. జరిగినవి చేదు జ్ఞాపకాలు అయినప్పటికీ అవి తీపి మార్పుకు నాంది పలికితే కచ్చితంగా అలాంటి మార్పును స్వాగతించవచ్చు. అయితే ఆ మార్పు అనేది ఎంత కాలం ఉంటుంది. అది నిజమైన మార్పు అని నమ్మవచ్చా అంటే వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి మార్పే వైయస్ జగన్ లో కనిపిస్తుందని పలువురు చెబుతున్నారు. ఇంతకాలం కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వైయస్ జగన్ కలవరు అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. కానీ ఇటీవల 2024 ఎన్నికల్లో భాగంగా ఎదురైన ఘోర ఓటమి అనంతరం వైయస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే జూన్ 22న (శనివారం) ఉదయం తాడేపల్లి లోని క్యామ్ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.

దీనిలో భాగంగా వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థుల తో వైయస్ జగన్ భేటీ కానున్నారు. వీరితోపాటు ఎంపీలు పార్లమెంట్ నుండి పోటీ చేసిన అభ్యర్థులను కూడా వైయస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన చర్చ ఒకటి తెరపైకి వచ్చింది.అయితే వాస్తవానికి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా పరదాలకు పరిమితం అయ్యారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం సొంత పార్టీ నాయకులను కూడా వైయస్ జగన్ కలవడం లేదని పలు సందర్భాలలో సొంత పార్టీ మంత్రులకు సైతం చేదు అనుభవాలు ఏదైనా పరిస్థితులు ఉన్నాయని వార్తలు ఉన్నాయి.

Ys Jagan ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్ జగన్ లో పెను మార్పు ఇకపై ఇలాగే ఉంటుందా

Ys Jagan : ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్ జగన్ లో పెను మార్పు… ఇకపై ఇలాగే ఉంటుందా…?

ఇలాంటి నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జగన్ కు ఊహించని షాక్ ఇచ్చాయని పలువురు అంటున్నారు. దీంతో ప్రస్తుతం వైఎస్ జగన్ తన పార్టీ నేతలతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో వైసీపీ సర్కార్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు , ఈ ఘోర ఓటమికి గల కారణాలు సర్వేల ద్వారా కాకుండా స్థానిక నేతలు నుండి తెలుసుకునే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింటా హల్ చల్ చేస్తున్నాయి. ఇదేదో కనీసం ఎన్నికలకు 6 నెలల ముందు చేసిన పరిస్థితి వేరేగా ఉండేది కదా అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జగన్ లో పెను మార్పును తీసుకువచ్చాయని పలువురు చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది