AP Speaker : జగన్ తన శాసన సభ సభ్యత్వం కోల్పోతారు : ఏపీ స్పీకర్
ప్రధానాంశాలు:
AP : జగన్ తన శాసన సభ సభ్యత్వం కోల్పోతారు : ఏపీ స్పీకర్
AP Speaker : శాసన సభ సమావేశాలకు ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజులు అనుమతి తీసుకోకుండా గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతారని Andhra pradesh ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. మీడియాతో వారు మాట్లాడుతూ.. కంటిన్యూగా 60 రోజులు అనుమతి తీసుకోకుండా గైర్హాజరు అయితే సభ్యుడు తన సభ్యత్వం కోల్పోతారు.
![AP Speaker జగన్ తన శాసన సభ సభ్యత్వం కోల్పోతారు ఏపీ స్పీకర్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/AP-Speaker-1.jpg)
AP Speaker : జగన్ తన శాసన సభ సభ్యత్వం కోల్పోతారు : ఏపీ స్పీకర్
AP Speaker రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం
రాజ్యాంగంలో ఈ నిబంధన ఉంది, దాన్ని అమలు చేయడ సభ బాధ్యత అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం స్పష్టంగా రాసి ఉంది. దాన్నే అమలు చేయాల్సిన బాధ్యత సభ మీద ఉంది. శాసన సభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులెవరైనా సరే సహేతుక కారణాలతో సెలవు కోరకుండా సభకు హాజరు కాకపోతే అనర్హత తప్పదని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత వరకు సెలవు కోరలేదని వెల్లడించారు.
జగన్‌కు ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆయనకు వచ్చింది 11 సీట్లు అన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్‌లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు అసెంబ్లీలో సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు అనడం వింతగా ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యుల లేఖలో సహేతుక కారణం ఉంటే స్పీకర్ అనుమతి ఇస్తారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుంది.