YS Jagan : పవన్ కళ్యాణ్ చూసి నేటి యువత ఏం నేర్చుకోవాలి.. ఆ స్థాయిలో ఉండి అలాంటివాడు చేసే పనులు అవేనా… వైయస్ జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : పవన్ కళ్యాణ్ చూసి నేటి యువత ఏం నేర్చుకోవాలి.. ఆ స్థాయిలో ఉండి అలాంటివాడు చేసే పనులు అవేనా… వైయస్ జగన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2024,3:00 pm

YS Jagan : దాదాపు 5 సంవత్సరాల తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో భాగంగా అనేక రకాల విషయాల గురించి జగన్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే అభివృద్ధి జరగలేదని పదే పదే విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆధారాలతో సహా చూపించి కౌంటర్ వేశాడు. సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీతో స్నేహం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పిన జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశాడు.. రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తాడు అనే విషయాలను కూడా పూస గుచ్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రచారాలలో భాగంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు చేస్తున్నారో కూడా జగన్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇక ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ …ప్రతిపక్ష నేతలు మాట్లాడిన విధంగా నేను బూతులు మాట్లాడటం లేదని తెలియజేశారు. దాదాపు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఈ మంచి పని చేశాను , నా వలన రాష్ట్రానికి ఈ మంచి పని జరిగింది , నావల్ల ఇంత మంచి జరిగింది , నా మంచిని చూసి ఓటు వేయండి అని అడగలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని జగన్ తెలిపారు. ఇక ఇటువైపు జగన్ ఈ 59 నెలల్లో ఆంధ్ర రాష్ట్రానికి నేను చేసిన మంచి ఇది , జరిగిన మంచిని చూసి నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. నాకు మరియు చంద్రబాబు నాయుడు కు మధ్య ఉన్న తేడా ఇదే అంటూ జగన్ స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువగా మాట్లాడుతానని , వాస్తవానికి నేను ఎక్కువగా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గురించి అని తెలిపారు.

YS Jagan పవన్ కళ్యాణ్ చూసి నేటి యువత ఏం నేర్చుకోవాలి ఆ స్థాయిలో ఉండి అలాంటివాడు చేసే పనులు అవేనా వైయస్ జగన్

YS Jagan : పవన్ కళ్యాణ్ చూసి నేటి యువత ఏం నేర్చుకోవాలి.. ఆ స్థాయిలో ఉండి అలాంటివాడు చేసే పనులు అవేనా… వైయస్ జగన్..!

YS Jagan నేటి యువతకు ఏం సందేశం ఇస్తున్నారు…

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే…ఒక రాజకీయ నాయకుడిగా సినీ స్టార్ హీరోగా ఉన్నప్పుడు , ఒక క్రమబద్ధతతో ఉండాలి. ఎందుకంటే నేటి యువత చాలామంది వారిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటే అది రేపటి యువతను ఏ విధంగా ప్రభావం చేస్తుంది అని ఈ సందర్భంగా జగన్ వివరించారు. ఈ విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్ గా తీసుకున్నవారు రేపు అదే పని చేస్తే రేపు అక్కచెల్లెళ్ల పరిస్థితి ఏంటి అంటూ జగన్ తెలిపారు. ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి చేస్తే పొరపాటు , రెండోసారి చేస్తే గ్రహపాటు కానీ మూడోసారి కూడా అదే తప్పు చేస్తున్నాడు అంటే అది అలవాటు అని ఈ సందర్భంగా జగన్ వివరించారు. దీంతో ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో వైరల్ గా మారాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది