Ysrcp : వైసీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా.. ఫ్యాన్ వ‌దిలి గ్లాస్ ప‌ట్టుకోనున్న బాలినేని..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : వైసీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా.. ఫ్యాన్ వ‌దిలి గ్లాస్ ప‌ట్టుకోనున్న బాలినేని..!

Ysrcp : ఇటీవ‌లి కాలంలో వైసీపీకి ఎదురుదెబ్బ‌లు ఎక్కువ‌గా త‌గులుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న వారు మెల్ల‌గా సైడ్ తీసుకుంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి.. జగన్‌కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్.. బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నేడో, […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 September 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : వైసీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా.. ఫ్యాన్ వ‌దిలి గ్లాస్ ప‌ట్టుకోనున్న బాలినేని..!

Ysrcp : ఇటీవ‌లి కాలంలో వైసీపీకి ఎదురుదెబ్బ‌లు ఎక్కువ‌గా త‌గులుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న వారు మెల్ల‌గా సైడ్ తీసుకుంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి.. జగన్‌కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్.. బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నేడో, రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. జగన్‌కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారు.

Ysrcp అంతా స‌స్పెన్స్..

కొంతకాలంగా వైసీపీలో బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ ఆయన సూచించిన కొందరిని జగన్ పక్కకు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అప్పుడే బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలోనే కొనసాగారు.జిల్లాలో వైసీపీలో మరో కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో కూడా బాలినేనికి విభేదాలు ఉన్నాయి.

Ysrcp వైసీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా ఫ్యాన్ వ‌దిలి గ్లాస్ ప‌ట్టుకోనున్న బాలినేని

Ysrcp : వైసీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా.. ఫ్యాన్ వ‌దిలి గ్లాస్ ప‌ట్టుకోనున్న బాలినేని..!

ప్రస్తుతం యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కూడా బాలినేని గుర్రుగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే బాలినేని చేరికపై జనసేన, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బాలినేని మాత్రం నేరుగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోనే మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.2012లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2019 లో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది