Barrelakka : ప్రచారం చేస్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు – బర్రెలక్క… వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barrelakka : ప్రచారం చేస్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు – బర్రెలక్క… వీడియో !

 Authored By anusha | The Telugu News | Updated on :24 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Barrelakka : ప్రచారం చేస్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు - బర్రెలక్క... వీడియో !

  •  సోషల్ మీడియా ద్వారా బర్రెలక్కగా ఫేమస్ అయిన శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం

Barrelakka : సోషల్ మీడియా ద్వారా బర్రెలక్కగా ఫేమస్ అయిన శిరీష Barrelakka Sirsha కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం kollapur assembly constituency నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాగర్ కర్నూలు Nagarkurnool జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అధికార పార్టీకి పోటీగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆమె కొల్లాపూర్ పరిధిలోని పెద్ద కొత్తపల్లి మండలం వెన్న చర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్క తో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తమ్ముడు భరత్ కుమార్ ని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో బర్రెలక్కకు ఏమీ కాలేదు. కానీ ఆమె తమ్ముడు గాయపడ్డాడు.

దాడి తర్వాత బర్రెలక్క బోరున ఏడ్చేశారు. తాను ఏం పాపం చేశానని ఇలాంటి దాడులు చేస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. చిన్నవాడైన తన తమ్ముని కళ్ళముందే కొట్టారని చెప్పుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా బర్రెలక్క తనపై దాడి చేసినందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తనకు రక్షణ కల్పించమని పోలీసు వారిని కోరారు. ఇక పోలీసు వారు కూడా ఆమెకు భద్రత కల్పిస్తామని చెప్పారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది మాత్రం ఆమె బయటకు చెప్పలేదు. ఇక నిరుద్యోగ అంశమే ప్రధానంగా బర్రెలక్క ఎన్నికల బరిలోకి దిగారని తెలుస్తుంది.

గతంలో డిగ్రీ చదివిన ఈమె జాబ్ లేక గేదెలు కాసుకుంటూ వీడియోని చేశారు. ఆ ఒక్క వీడియోతో ఈమె రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారారు. మరోవైపు బర్రెలక్క ప్రచారానికి విరాళాలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. చాలామంది ఎన్నారైలు ఆమె ప్రచారానికి సాయం చేస్తున్నారు. ఆమె తరపున నిరుద్యోగులు నియోజకవర్గంలో ప్రచారానికి సహకరిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో బర్రెలక్క ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది