Pawan Kalyan – Allu Arjun : మెగా- అల్లు అర్జున్ మ‌ధ్య ముదురుతున్న వివాదం.. ప‌వ‌న్‌కి ఎస‌రు పెట్టారుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan – Allu Arjun : మెగా- అల్లు అర్జున్ మ‌ధ్య ముదురుతున్న వివాదం.. ప‌వ‌న్‌కి ఎస‌రు పెట్టారుగా..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2024,1:00 pm

Pawan Kalyan – Allu Arjun : ఒకప్పుడు క‌లిసి క‌ట్టుగా ఉన్న మెగా – అల్లు ఫ్యామిలీ మాత్రం ఇప్పుడు బ‌ద్ధ శ‌త్రువులుగా మారారు. మెగా అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున నంద్యాల నుంచి పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ స్వయంగా నంద్యాల వెళ్లి ప్రచారం చేయ‌డంతో వివాదం మొద‌లైంది.. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. బన్నీ మాత్రం పవన్ గెలవాలని కోరుకుంటూ ఓ ట్వీట్ తో సరిపెట్టారు. అంతేకాదు అస‌లే వివాదం ముదురుతుండ‌గా, ఇటీవ‌ల సినిమా వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తనవారికోసం ఎంత దూరమైనా వెళ్తాలనని ప్రకటించడంపైమెగా అభిమానులు నిప్పులు చెరుగుతున్నాయి.

Pawan Kalyan – Allu Arjun : ఏం జ‌రుగుతుంది..

జనసేన పార్టీ ఉన్నప్పటికీ వైసీపీకి మద్దతివ్వడంపై, బన్నీ కామెంట్స్ పై ఇప్పుడు జ‌న‌సేన నాయ‌కులు కూడా భ‌గ్గుమంటున్నారు. సినిమాల్లో హీరో క్యారెక్టర్‌ ట్రెండ్‌ ఎలా మారుతూ వస్తోందో బెంగళూరు జరిగిన ఓ కార్యక్రమంలో అలా కామెంట్‌ చేశారు పవన్‌. అల్లూ అర్జున్‌ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలను చేశారని బన్నీ ఫ్యాన్స్‌ హార్టయ్యారు. ఔనా..కాదా? అనేది పవన్‌ కల్యాణే క్లారిటీ ఇవ్వాలన్నారు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి. ఇక ఈ సీక్వెన్స్‌లోనే మారుతీ సుబ్రమణ్యం మూవీ ఫంక్షన్‌లో ..నాకు నచ్చితే ఎక్కడికైనా..ఎందాకైన వెళ్తా అంటూ బన్నీ చేసిన కామెంట్స్‌ కేంద్రంగా సోషల్‌ మీడియా ఫ్యాన్స్‌ వార్‌ మరింత రాజుకుంది.

ఇలా ఫ్యాన్స్‌ మధ్య వార్‌ కొనసాగుతుండగానే కాంట్రవర్సీ ఫ్రేమ్‌లోకి లేటెస్ట్‌గా పొలిటికల్‌ రాకెట్‌ దూసుకు వచ్చింది. ఆయ‌నే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌. అల్లు అర్జున్‌ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు బొలిశెట్టి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచింది. తమకు అల్లు అర్జున్‌ సపోర్ట్‌ ఏం అవసరమన్నారు. ఆయన ప్రచారం చేసిన చోట ఫలితం ఏంటో అందరికీ తెలుసన్నారు. గతంలోనూ వాళ్ల నాన్ననే ఆయన గెలిపించుకోలేకపోయారన్నారు. అసలే ఫ్యాన్స్‌ వార్‌ కాక మీదున్న టైమ్‌లో బొలిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అభిమానుల మధ్య ముదురుతోన్న సోషల్‌ మీడియా వార్‌.. తాజా పరిమణాల నేపథ్యంలో ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందనే చర్చ ఇప్పుడు జోరందుకుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది