Errabelli Dayakar Rao : ఎర్రబెల్లికి భారీ షాక్.. ఝాన్సీరెడ్డి సమక్షంలో హస్తం గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Errabelli Dayakar Rao : ఎర్రబెల్లికి భారీ షాక్.. ఝాన్సీరెడ్డి సమక్షంలో హస్తం గూటికి బీఆర్ఎస్ కీలక నేతలు

 Authored By kranthi | The Telugu News | Updated on :20 October 2023,6:00 pm

Errabelli Dayakar Rao : ఝాన్సీ రెడ్డి పేరు కొత్తగా వినిపించి ఉండొచ్చు కానీ.. ఝాన్సీ రెడ్డి పేరు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మారుమోగిపోతోంది. దానికి కారణం.. ఆమె ఒక ఎన్ఆర్ఐ. తనది పాలకుర్తి నియోజకవర్గం. 6 నెలల కింద భారత్ కు వచ్చిన ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. నిజానికి పాలకుర్తి నియోజకవర్గం అంటేనే రాజకీయాలు చాలా హీటెక్కిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. అందుకే.. అక్కడ వేరే పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారా అని పెద్ద రచ్చ నడుస్తోంది. అయితే.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లిని ఢీకొట్టే వారు లేరని అనుకుంటున్న నేపథ్యంలో ఝాన్సీ రెడ్డి రాకతో బీఆర్ఎస్ క్యాడర్ కు టెన్షన్ స్టార్ట్ అయింది.

పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎర్రబెల్లిని ఓడించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆమె సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఝాన్సీ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఇలా.. నియోజకవర్గంలో రోజూ కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండటంతో నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అనే మాటలు వినిపిస్తున్నాయి.

brs leaders join in congress in the presence of jhansi reddy

Errabelli Dayakar Rao : కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టాల్సిందే

ఈసందర్భంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి.. పేదలకు భూములు ఇవ్వాలన్నా.. ఇండ్లు కట్టించాలన్నా.. మన పొలాలకు నీళ్లు రావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలకు ఏర్పాట్లు జరగాలన్నా.. తెలంగాణలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఝాన్సీ రెడ్డి అన్నారు. వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ఝాన్సీ రెడ్డి ప్రజలను కోరారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది