Jhansi Reddy VS Errabelli : ఎర్రబెల్లిని ఝాన్సీ రెడ్డి తిడుతుంటే తీన్మార్ మల్లన్న రియాక్షన్ ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jhansi Reddy VS Errabelli : ఎర్రబెల్లిని ఝాన్సీ రెడ్డి తిడుతుంటే తీన్మార్ మల్లన్న రియాక్షన్ ఏంటో తెలుసా?

Jhansi Reddy VS Errabelli : తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. పాలకుర్తి నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు ఇంకో ఎత్తులా మారాయి. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా అక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఉంది. కానీ.. ఎప్పుడైతే ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి అక్కడ అడుగుపెట్టిందో అప్పటి నుంచి రాజకీయాలు మొత్తం మారిపోయాయి. మామూలుగా కాదు.. రాజకీయాలు చాలా వేడెక్కాయి. తనకు భారత పౌరసత్వం లేదని తనకు కాంగ్రెస్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :25 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  అప్పుడు ఇందిరా గాంధీ.. ఇప్పుడు ప్రియాంకా గాంధీ

  •  యశస్విని రెడ్డికి ఓటేసి గెలిపించండి

  •  పాలకుర్తి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం

Jhansi Reddy VS Errabelli : తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. పాలకుర్తి నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు ఇంకో ఎత్తులా మారాయి. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా అక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఉంది. కానీ.. ఎప్పుడైతే ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి అక్కడ అడుగుపెట్టిందో అప్పటి నుంచి రాజకీయాలు మొత్తం మారిపోయాయి. మామూలుగా కాదు.. రాజకీయాలు చాలా వేడెక్కాయి. తనకు భారత పౌరసత్వం లేదని తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో తన కోడలుకు ఇవ్వాలని పట్టుబట్టి మరీ తన కోడలు యశస్విని రెడ్డికి టికెట్ వచ్చేలా చేసింది ఝాన్సీ రెడ్డి. అంతే కాదు.. తన యూఎస్ లో రియల్ ఎస్టేట్ చేస్తూ వేల కోట్లు సంపాదించినట్టు తెలుస్తోంది. ఆ డబ్బును ఇక్కడ కుమ్మరించి ఈసారి ఎలాగైనా ఎర్రబెల్లిని ఓడించి తన సత్తా చాటాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది ఝాన్సీ రెడ్డి. అందులో భాగంగానే ఝాన్సీ రెడ్డి తన కోడలుతో చాలా బలంగా ప్రచారం చేయిస్తోంది. ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కోసం ఝాన్సీ రెడ్డికి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి.

తాజాగా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఝాన్సీ రెడ్డి ఎర్రబెల్లిపై మండిపడ్డారు. నా కోడలు, మీకు కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డిని దీవించడానికి ఇక్కడికి వచ్చిన పాలకుర్తి బిడ్డలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. దయాకర్ రావు ఆరోజు నేను ప్రజా సేవ చేద్దామని, రాజకీయాల్లోకి వద్దామని రావడం జరిగింది. మా కుటుంబం 40 ఏళ్ల నుంచి కూడా మీ మధ్య ఉండి స్వచ్ఛందంగా సేవలు చేసుకుంటూ జీవిస్తున్న కుటుంబం మాది. కానీ.. దయాకర్ రావుకి అది నచ్చలేదు. అది నచ్చక మేము మళ్లీ అమెరికా పోవాలని నాకు పౌరసత్వం రానీయకుండా చేశాడు. అయినా కానీ.. నేను మీకు జూన్ లో ఇచ్చిన మాట కోసం, మీకు అండగా ఉంటాననే మాట కోసం, నాకు పౌరసత్వం రాకపోయినా నా వారసత్వం అయిన కోడలును ఇక్కడికి తీసుకొచ్చాను. అదే విధంగా దయాకర్ రావు.. ఏదో ఏదో మా కుటుంబం మీద ప్రచారాలు చేస్తున్నాడు. దయాకర్ రావుకు చెప్పేదొక్కటే. మా కుటుంబం మీద మాట్లాడే హక్కు కానీ.. అర్హత కానీ నీకు లేదు. నా కుటుంబానికి, నీ కుటుంబానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. ఆ మధ్యలో నా పాలకుర్తి ప్రజలు ఉన్నారు. అదే విధంగా నీకు లాగా రోజుకొక పార్టీ మారలేదు దయాకర్ రావు. నీ కుటుంబంలా ఒకరు టీఆర్ఎస్ లో, ఒకరు బీజేపీలో, ఒకరు కాంగ్రెస్ లో లేము. మొదటి నుంచి మేము పాలకుర్తి ప్రజలను నమ్ముకున్నాం. పాలకుర్తి గడ్డను నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీకి వందేళ్లకు పైన చరిత్ర ఉన్న పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇది. ఈ పార్టీని నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చామన్నారు ఝాన్సీ రెడ్డి.

Jhansi Reddy VS Errabelli : 1979లోనే ఇందిరా గాంధీ తొర్రూర్ కు వచ్చారు

1979లో మనకు ఇందిరా గాంధీ తొర్రూర్ కు వచ్చారని.. అప్పుడు కాంగ్రెస్ వచ్చిందని.. ఈరోజు ప్రియాంకా గాంధీ వస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలువబోతోందని ఝాన్సీ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ జనాలను చూసి దయాకర్ రావుకు నిద్ర పట్టదు. నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా.. మద్యం బాటిల్స్ ఇచ్చాన నా పాలకుర్తి ప్రజలు ఇంత మంది వచ్చారంటే.. నీ డబ్బు, మద్యం పని చేయదు. పని చేయట్లేదని ఇప్పుడే రుజువు అయింది. నవంబర్ 30న ఓటింగ్ రోజు కూడా అది పని చేయదు దయాకర్ రావు. మీరంతా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దయాకర్ రావుకు చెప్పేది ఒక్కటే. నా అమెరికా కుటుంబం ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తారా అని అడిగారు. నా అమెరికా కుటుంబం కంటే కూడా ఇన్ని వేల మంది పాలకుర్తి ప్రజల కుటుంబం ఉంది. పాలకుర్తి ప్రజలు అందరు కూడా నా తరుపున ఉంటారని నాకు నమ్మకం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మీరంతా ఓటింగ్ వేసేటప్పుడు యశస్విని రెడ్డికి చేతి గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటారని కోరుకుంటున్నానని ఝాన్సీ రెడ్డి చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది