Liquor : మందు బాబులకి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజులలో రచ్చ మాములుగా ఉండదు..!
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీనే తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మద్యం పాలసీ అమల్లోకి వస్తే మందు బాబులకు రిలీఫ్ దక్కనుంది. అటు ఎన్నికల సమయంలోనూ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తే..మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే […]
ప్రధానాంశాలు:
Liquor : మందు బాబులకి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజులలో రచ్చ మాములుగా ఉండదు..!
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీనే తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మద్యం పాలసీ అమల్లోకి వస్తే మందు బాబులకు రిలీఫ్ దక్కనుంది. అటు ఎన్నికల సమయంలోనూ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తే..మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న లిక్కర్ పాలసీని అధ్యయనం చేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Liquor ఇక తక్కువ ధరలకే..
ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ఈ నెల 18న జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందు ప్రతిపాదనలు ఉంచాలని, ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రిఫండబుల్ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలపైన అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది.
ఈ సందర్భంగా 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యం విధానాన్నే తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 17న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేవలం సొంత ఆదాయం పెంచుకునేలా మద్య విధానం రూపొందించారని తెలిపారు. పూర్తిగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా మద్యం విధానం రూపొందించారని వెల్లడించారు. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజలు ఆరోగ్యం దెబ్బతిందన్నారు. అందుకోసమే నూతన మద్యం విధాన రూపకల్పనపై తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం తెచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు