Liquor | ఖాళీ కడుపుతో మద్యం తాగితే ఏం జరుగుతుంది .. నిపుణుల హెచ్చరిక ఇదే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liquor | ఖాళీ కడుపుతో మద్యం తాగితే ఏం జరుగుతుంది .. నిపుణుల హెచ్చరిక ఇదే!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 October 2025,9:36 am

Liquor | నేటి కాలంలో చాలామందికి ఆకలిగా ఉన్నప్పుడే మద్యం తాగే అలవాటు ఉంది. ఇది సరదాగా అనిపించినా, శరీరానికి ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకలిగా ఉన్న సమయంలో మద్యం తాగడం వల్ల తక్షణమే మత్తు పెరగడమే కాక, భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో మద్యం తాగితే శరీరంలో ఏమి జరుగుతుంది?

మన శరీరంలో ఆహారం తిన్న వెంటనే అది అన్నవాహిక ద్వారా కడుపులోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఆహారం ప్రాసెస్ అయి రక్తనాళాల ద్వారా రక్తంలో కలుస్తుంది.
కానీ ఖాళీ కడుపుతో మద్యం తాగితే ఆ రక్షణ వ్యవస్థ ఉండదు — మద్యం నేరుగా రక్తంలోకి వేగంగా శోషించబడుతుంది.

కనిపించే లక్షణాలు

ఖాళీ కడుపుతో మద్యం తాగిన వెంటనే —

తల తిరగడం

మాటలు అస్పష్టంగా రావడం

నడవడంలో ఇబ్బంది

వాంతులు, వికారం

ఇవి కొన్ని నిమిషాల్లోనే కనిపించవచ్చు. ఎందుకంటే కడుపులో ఆహారం లేకపోవడంతో మద్యం ప్రభావం రెట్టింపుగా ఉంటుంది.

దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు

నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల —

కాలేయ సమస్యలు

జీర్ణ సమస్యలు

నాడీ వ్యవస్థ దెబ్బతినే అవకాశం

హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం)

వంటివి తలెత్తవచ్చు.

నిపుణులు ఏం చెబుతున్నారు –

“మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కానీ తప్పనిసరిగా తాగాల్సి వస్తే ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి. తేలికపాటి ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే తాగండి.”

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది