Gas Stove : కేంద్ర ప్రభుత్వం రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్లు… ఎలా పొందాలంటే…!
Gas Stove : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడవ సారి అధికారంలోకి రావడం జరిగింది. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఉజ్వల స్కీమ్ ని మళ్లీ ప్రారంభించారు. అయితే ఈ పథకం ద్వారా ఒక గ్యాస్ స్టవ్ అలాగే ఒక గ్యాస్ సిలిండర్ ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. వాటితో పాటుగా గ్యాస్ సిలిండర్ రీ ఫిల్లింగ్ పై సబ్బిడి కూడా ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉజ్వల స్కీమ్ కింద ఇప్పటికే వంద కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం యొక్క సెకండ్ ఫేస్ ను ప్రారంభించింది. దీంతో కొత్తగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న వారు ఈ పధకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిని అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హత పత్రాలు కావాలి. అలాగే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం…
Gas Stove : ఉచిత గ్యాస్ స్టవ్ పొందేందుకు అర్హతలు.
ఉజ్వల స్కీమ్ ని పొందాలి అనుకున్న లబ్ధిదారులు కచ్చితంగా మహిళలు అయి ఉండాలి. ఆ మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే కుటుంబంలోని మరొకరికి LPG కలెక్షన్ ఉండకూడదు. అదేవిధంగా ఆ మహిళలు ఎస్సీ ,ఎస్టీ , గిరిజనులు , అత్యోదయ అన్నయోజన , ప్రధానమంత్రి ఆవాస్ యోజన , మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ , అడవుల్లో జీవించేవారు , మాజీ టీ గార్డెన్ గిరిజనలు , నదుల్లో దీవుల్లో ఉండేవారు పేదరిక రేఖ ధిగువ గా ఉండేవారు ఈ పథకానికి అర్హులు అవుతారు.
Gas Stove ఉచిత గ్యాస్ స్టవ్ పొందేందుకు అవసరమైన పత్రాలు.
మహిళల లబ్దిదారి యొక్క ఆధార్ కార్డు , అడ్రస్ గుర్తింపు కార్డు , ఐడెంటి కార్డు , బ్యాంక్ అకౌంట్ నెంబర్ , రేషన్ కార్డు , బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ కచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే లబ్ధి దారులు వారికి నచ్చిన LPG గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ను ఎంచుకోవచ్చు.
Gas Stove ఎలా దరఖాస్తు చేసుకోవాలి…
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ స్టాప్ పొందాలంటే , ముందుగా అధికారిక పోర్టల్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసే సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికోసం మీరు మీ సమీపంలో గల మీసేవ కేంద్రాలను సంప్రదించండి.