Private Sector Employees : ప్రైవేట్‌రంగ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీసం వేతనం రూ.30 వేలు?
ప్రధానాంశాలు:
Private Sector Employees : ప్రైవేట్‌రంగ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీసం వేతనం రూ.30 వేలు?
Private Sector Employees : ధరల పెరుగుదల సామాన్యుల కడుపుని పిండేస్తోంది. ఇప్పుడు దేశ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి కేంద్రం ఉపశమన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని పెంచబోతోంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఇప్పుడు కనీస వేతంన ఇవ్వాల్సి వస్తుంది.

Private Sector Employees : ప్రైవేట్‌రంగ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీసం వేతనం రూ.30 వేలు?
భారతదేశంలో లక్షలాది మంది ఉద్యోగులు చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. వారి శ్రమతో పోలిస్తే వేతనం తక్కువగా ఉన్న చాలా మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంతరాన్ని పూడ్చడానికి సిద్ధంగా ఉంది.ఈ కొత్త బిల్లు వస్తే కనీస వేతనం రూ.20,000 అవుతుందని, అంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో రూ.20,000 కంటే తక్కువ జీతం ఇవ్వలేమని వర్గాలు తెలిపాయి.
సమాచారం ప్రకారం, బిల్లులో వార్షిక జీతాల పెంపుదలకు సంబంధించిన నిబంధనలు కూడా ఉంటాయి. అధిక వేతనం పొందే వారి జీతాలు తగ్గించబడకుండా ప్రభుత్వం చూసుకుంటుంది.
విద్యను మూడు స్లాబ్‌లలో నిర్ణయించవచ్చు. ఆ మూడు స్లాబ్‌ల ఆధారంగా జీతాలు ఇవ్వబడతాయి. ఉదాహరణకు హయ్యర్ సెకండరీ ఉత్తీర్ణులైన వారికి కనీసం రూ.20,000 ఇవ్వాలి, గ్రాడ్యుయేట్‌కు రూ.30,000 కంటే తక్కువ చెల్లించకూడదు. మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే కనీస జీతం రూ. 35,000 ఉంటుంది. మోడీ ప్రభుత్వం అలాంటి బిల్లును తీసుకురాబోతోందని సంబంధిత వర్గాల నుండి సమాచారం. అయితే, ఈ వార్త నిజమా కాదా అనే దానిపై మోడీ ప్రభుత్వం ఇంకా వ్యాఖ్యానించలేదు. అయితే ఈ కొత్త బిల్లు నిజమైతే ఈ సంవత్సరం ఆమోదం పొందవచ్చని తెలిసింది.