Chandrababu Naidu : గుడివాడ గడ్డ మీదే కొడాలి నాని కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : గుడివాడ గడ్డ మీదే కొడాలి నాని కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ..!

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : గుడివాడ గడ్డ మీదే కొడాలి నాని కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ..!

Chandrababu Naidu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో నిర్వహించిన ‘ రా కదలిరా ‘ బహిరంగ సభలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ.. అని విమర్శించారు. ముఖ్యమంత్రి తన సొంత చెల్లి తో పాటు పలువురిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. డీఎస్సి అన్నారు. అవి ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు. మహానుభావులు పుట్టిన గడ్డ కృష్ణాజిల్లా అన్నారు.టిడ్కో ఇళ్లను టీడీపీ కట్టిస్తే క్రెడిట్ వారు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెడితే సరిపోతుందా అని చంద్రబాబు చురక అంటించారు. టిడ్కో ఇల్లు కట్టింది తామేనని, ఇళ్లను 90% తామే పూర్తి చేశామని, కానీ వారు కనీసం 10% కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అలాంటివారు మూడు రాజధానులు కడతారా అని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రజలు తొందరలోనే వైసీపీని భూస్థాపితం చేస్తారని అన్నారు. వైసీపీ నేతలు నోరు మురికి కాలువ అని, తన వద్ద ఓనమాలు నేర్చుకొని తనకే పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. నోరు ఉందని పారేసుకుంటే భవిష్యత్తులో అందుకు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నానని కొడాలి నానికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.జనసేన, టీడీపీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నానని అహంభావంతో విర్రవీగే వ్యక్తులను చిత్తుచిత్తుగా ఓడించడం మాత్రమే కాదని, కాలగర్భంలో కలిసేలా చేయాలని అన్నారు. తమ పోరాటం పవన్ కోసమో, తన కోసమో కాదని, ప్రజాహితం కోసమే అన్నారు. భావితరాల కోసం రా కదలిరా అంటూ పిలుపునిచ్చారు. తన ఈ పిలుపు ప్రభంజనంగా మారాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు అన్నారు. గుడివాడలో బూతుల మంత్రి ఉంటే బందర్ లో నీతుల మంత్రి ఉన్నాడని చంద్రబాబు చురక అంటించారు.

ఏమి కాంబినేషన్.. బ్రహ్మాండమైన కాంబినేషన్ అని ఎద్దేవా చేశారు. పవన్ ను తిట్టేందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో ఎక్కడ చూసిన భూ కబ్జాలే అని, బందర్ పోర్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు దానిని పూర్తి చేయలేదన్నారు. టీడీపీ ఉంటే ఇప్పటికే పూర్తి చేసే వాళ్ళమన్నారు. రాష్ట్రం మొత్తం టీడీపీ, జనసేన గాలి వీస్తుందన్నారు. ఈ గాలి సునామీల మారి వైసీపీ ని చిత్తుచిత్తుగా ఓడిస్తుందన్నారు. వైసీపీ ఓటమి ఖాయం అయిందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైలు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన తడాఖాను చూపిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది