Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ప్రవర్తన తేడాగా ఉందే.. సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా..!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటిపోయింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌పై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం కూడా మనం చూశాం. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారు, టికెట్లు దక్కని వారు, వలస నేతలు తదితరులకు న్యాయం చేస్తామని అధినేతలు హామీ ఇచ్చారు. వైసిపిని ఓడించడంలో… కూటమిని గెలిపించడంతో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఇలా ఇంతకాలం సినిమాల్లో పవర్ స్టార్ గా నిరూపించుకున్న పవన్ ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాజకీయాల్లోనూ పవర్ ఫుల్ గా మారారు.
కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కు ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం ఆయనకే దక్కింది…. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు దక్కాయి. చంద్రబాబు కేబినెట్ లో పవన్ తో పాటు మరో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. అయితు ఇటీవల చంద్రబాబు తన వెంట పవన్ ని తీసుకెళ్లకపోవడం ఆసక్తికరంగా మారింది. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు ఒక్కరే వెళుతున్నారు. ఇదే ఇప్పుడు పలు అనుమానాలను రెకె్త్తిస్తోంది… పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టేసారనే ప్రచారం ప్రారంభమయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ భేటీ అయ్యారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ప్రవర్తన తేడాగా ఉందే.. సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా..!
ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గోన్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు… డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనలేదు. ఇది పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టారంటూ ప్రచారానికి దారితీసింది. రీసెంట్‌గా ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు.. మంత్రుల్లో పయ్యావులు కేశవ్ తో పాటు మరికొందరిని వెంట తీసుకెళ్లారు కాని పవన్‌ని తీసుకెళ్లలేదు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇలా పవన్ లేకుండా చంద్రబాబు పలుచోట్లకి వెళుతుండడం అందరిలో అనేక అనుమానాలు కలిగేలా చేస్తుంది.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.