Breaking News : చంద్రబాబుకు అనారోగ్యం.. జైలు దగ్గర టెన్షన్ టెన్షన్.. డాక్టర్లు ఏమన్నారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Breaking News : చంద్రబాబుకు అనారోగ్యం.. జైలు దగ్గర టెన్షన్ టెన్షన్.. డాక్టర్లు ఏమన్నారు?

Breaking News : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అది అక్రమ అరెస్ట్ అని.. అసలు ఆధారాలు లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారు.. ఎలా అరెస్ట్ చేస్తారంటూ టీడీపీ అభిమానులు, నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు చంద్రబాబు ఫ్యామిలీ కూడా రాజమండ్రిలోనే ఉంటూ చంద్రబాబు ఎప్పుడు రిలీజ్ అవుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :11 October 2023,4:00 pm

Breaking News : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అది అక్రమ అరెస్ట్ అని.. అసలు ఆధారాలు లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారు.. ఎలా అరెస్ట్ చేస్తారంటూ టీడీపీ అభిమానులు, నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు చంద్రబాబు ఫ్యామిలీ కూడా రాజమండ్రిలోనే ఉంటూ చంద్రబాబు ఎప్పుడు రిలీజ్ అవుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ వీళ్లంతా రాజమండ్రిలో తమకు తోచిన విధంగా ధర్నాలు చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే.. చంద్రబాబుకు కావాల్సిన సౌకర్యాలేవీ కల్పించడం లేదని.. జైలులో ఒక వీఐపీకి, మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన సౌకర్యాలేవీ లేవని, దోమలు కుడుతున్నా పట్టించుకోవడం లేదని, కనీసం ఫ్యాన్ కూడా లేదని.. వేడి నీళ్లు కూడా స్నానానికి ఇవ్వడం లేదంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై కీలక అప్ డేట్ విడుదలైంది.

ప్రస్తుతం ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఈనేపథ్యంతో రాజమండ్రిలో కూడా ఎండలు తీవ్రస్థాయిలో ఉండటంతో చంద్రబాబుకు తీవ్ర ఉక్కపోత గురైనట్టు తెలుస్తోంది. ఆయన రూమ్ లో కనీసం ఫ్యాన్ కూడా లేకపోవడంతో చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారట. ఈ విషయాన్ని తన వైద్యాధికారికి కూడా చంద్రబాబు చెప్పారట. ఈ విషయాలను తన కుటుంబ సభ్యులతో జరిగిన ములాఖత్ లోనూ చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు అందిస్తున్న సౌకర్యాలు సరిగ్గా లేవని.. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని.. ఆయనకు ఇప్పటికైనా జైలులో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. లేదంటే వైసీపీ పార్టీని రాబోయే కాలంలో ఇంట్లో కూర్చోబెడతాం అని మండిపడ్డారు.

chandrababu health condition in jail

#image_title

Breaking News : క్వాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు

మరోవైపు చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై అక్రమ కేసు పెట్టారని.. తనకు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ వేయగా.. దానిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. సోమవారం విచారణ జరిగిన అనంతరం వాయిదా వేసిన కోర్టు.. మంగళవారం కూడా విచారించింది. దానికి సంబంధించి ఇంకా ఆధారాలు సమర్పించాలని మళ్లీ ఆ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అక్రమాలు చేశారని సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ గా ఉంచారు. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ ను మూడు సార్లు పొడిగించారు. జైలులోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది