Chandrababu Naidu : ఈ వ‌య‌స్సులోను నిర్విరామంగా ప‌ని చేస్తున్న చంద్ర‌బాబు.. దావోస్ టు ఢిల్లీకి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : ఈ వ‌య‌స్సులోను నిర్విరామంగా ప‌ని చేస్తున్న చంద్ర‌బాబు.. దావోస్ టు ఢిల్లీకి..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 January 2025,3:30 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : ఈ వ‌య‌స్సులోను నిర్విరామంగా ప‌ని చేస్తున్న చంద్ర‌బాబు.. దావోస్ టు ఢిల్లీకి..!

Chandrababu Naidu : AP  CM Chandrababu Naidu ఏపీ సీఎం చంద్ర‌బాబు 74 ఏళ్ల వ‌య‌స్సులో న‌వ యువ‌కుడిలా చ‌క్క‌ర్లు కొడుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక చంద్ర‌బాబుకి ముఖ్య‌మంత్రి ప‌దవి ద‌క్కింది. ఇక ప‌దవి ద‌క్కిన‌ప్ప‌టి నుండి ఏ మాత్రం అశ్ర‌ద్ధ చేయ‌కుండా బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. తన అనుభవ సారాన్నంతా ఒడబోసి.. దావోస్‌ వేదికపై ఏపీ సీఎం చంద్రబాబు ఉనికిని చాటుకుంటున్నారు. తనేంటో ప్రూవ్ చేసుకుంటూ ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ కంపెనీలతోపాటు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమవుతున్నారు. జన్మభూమి కోసం తోడ్పడాలని ప్రవాసులను కోరారు.

Chandrababu Naidu ఈ వ‌య‌స్సులోను నిర్విరామంగా ప‌ని చేస్తున్న చంద్ర‌బాబు దావోస్ టు ఢిల్లీకి

Chandrababu Naidu : ఈ వ‌య‌స్సులోను నిర్విరామంగా ప‌ని చేస్తున్న చంద్ర‌బాబు.. దావోస్ టు ఢిల్లీకి..!

Chandrababu Naidu దావోస్ టూ ఢిల్లీ…

దావోస్‌ పర్యటనలో వేర్వేరు రంగాలకు చెందిన దాదాపు 15 వాణిజ్య సంస్థల అధిపతులతో ఏపీ సీఎం చంద్రబాబు Chandrababu Naidu సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి . అయితే బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని సీఎం ఆలోచిస్తున్నారు. గత ఏడాది ఓటాన్ బడ్జెట్ వల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధులిచ్చినా, రాష్ట్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ సారి సమయం ఉండటంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించాలని ముఖ్యమంత్రి టార్గెట్ గా పెట్టుకున్నారు.

దావోస్ పర్యటన ముగియగానే.. డైరెక్టుగా ఢిల్లీ వెళ్లి.. ఇవాళ కేంద్ర మంత్రులను కలిసేలా ప్లాన్ చేసుకున్నారు. సడెన్‌గా ఎందుకీ ఢిల్లీ టూర్ అంటే.. బలమైన కారణం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరో వారంలో అంటే.. ఫిబ్రవరి 1న ఆమె బడ్జె్ట్‌ని లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. అందులో ఏపీకి భారీగా ఆర్థిక సాయం రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ ఆఫీసులో నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. కేంద్రం ఈమధ్యే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి భారీ ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఆ మనీని త్వరగా ఇచ్చేలా చంద్రబాబు కోరే అవకాశం ఉంది. అలాగే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. దానికి కూడా కేంద్రం నుంచి రావాల్సిన మనీ గురించి సీఎం అడిగే అవకాశం ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది