Chandrababu : చంద్రబాబుకి ఇంత కక్క్రుత్తి ఉందా ఛీ.. సొంత పార్టీ వాళ్ళే ఛీ కొడుతున్నారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : చంద్రబాబుకి ఇంత కక్క్రుత్తి ఉందా ఛీ.. సొంత పార్టీ వాళ్ళే ఛీ కొడుతున్నారు !

Chandrababu : ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ.. ఏ పని చేసినా అంత తొందరపాటుతనం. ఏమాత్రం మెచ్యూరిటీ లేకుండా కొన్నిసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. ఏమన్నా అంటే నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అంటారు కానీ.. దానికి తగ్గట్టుగా మాత్రం ప్రవర్తించరు. మోస్ట్ సీనియర్ లీడర్ అంటారు. ఈ దేశంలో తనకు మించిన రాజకీయ అనుభవం ఉన్న నేత మరెవరూ లేరంటారు కానీ.. ఆయన మాట్లాడే మాటలు చూస్తే మాత్రం విచిత్రంగా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 July 2023,12:00 pm

Chandrababu : ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ.. ఏ పని చేసినా అంత తొందరపాటుతనం. ఏమాత్రం మెచ్యూరిటీ లేకుండా కొన్నిసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. ఏమన్నా అంటే నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అంటారు కానీ.. దానికి తగ్గట్టుగా మాత్రం ప్రవర్తించరు. మోస్ట్ సీనియర్ లీడర్ అంటారు. ఈ దేశంలో తనకు మించిన రాజకీయ అనుభవం ఉన్న నేత మరెవరూ లేరంటారు కానీ.. ఆయన మాట్లాడే మాటలు చూస్తే మాత్రం విచిత్రంగా ఉంటాయి.

ఎందుకంటే.. తాజాగా లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ విషయం ఏపీలో చర్చనీయాంశం అయింది. అది అక్రమ నిర్మాణం అని తేలినా కూడా తాను ఇంకా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఇంటి అంశం ఏసీబీ కోర్టులో ఉంది. ఆ కోర్టు కూడా ఆ ఇంటిని జప్తు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. కానీ.. తాను అద్దెకు ఉన్నానని.. అంటూ చంద్రబాబు బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ.. అసలు ఆ ఇంటి పేరు మీద ఎలాంటి అద్దె లావాదేవీలు జరగలేదని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.అసలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్ట వద్ద నిర్మాణం చేయడమే నిబంధనలకు విరుద్ధం. ఆ విషయం చంద్రబాబుకు తెలియదా? ఇటువంటి నిర్మాణాలపై చంద్రబాబే చాలా సార్లు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు.. లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటూ అది అద్దెకు తీసుకున్నాం అని చెప్పడం విడ్డూరంగా ఉంది. అలాగే..

chandrababu staying in lingamaneni ramesh house in vijayawada

chandrababu staying in lingamaneni ramesh house in vijayawada

Chandrababu : కృష్ణానది వరద నీటిని ఆడ్డగించే కరకట్టలో నిర్మాణం చేయడం విరుద్ధమే

ఆ ఇల్లు విషయంలో లింగమనేనికి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. అసలు.. లింగమనేని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు చంద్రబాబు వత్తాసు పలకడం ఏంటి అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో ద్వారా వచ్చిన ఇల్లు కాబట్టే చంద్రబాబు అంతలా బాధపడుతున్నారా అనే వార్తలూ వినిపిస్తున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది