Chandrababu : బూతులు మాట్లాడితే పారిపోతారు గుడివాడలో చంద్రబాబు హైలెట్ స్పీచ్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : బూతులు మాట్లాడితే పారిపోతారు గుడివాడలో చంద్రబాబు హైలెట్ స్పీచ్ వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :15 April 2023,9:00 pm

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల కృష్ణాజిల్లాలో “ఇదేం కర్మ” రాష్ట్రానికి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం గుడివాడ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ప్రారంభంలో తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు మధ్య గొడవ చోటు చేసుకుంది. గుడివాడ సెంటర్ శరత్ సినిమా థియేటర్ వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Kodali Nani comments about Chandrababu conspiracy

Kodali Nani comments about Chandrababu conspiracy

అనంతరం చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగా గజమాలతో సత్కరించడం జరిగింది. ఆ తర్వాత గుడివాడ సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానినీ ఉద్దేశించి బూతుల నాయకుడు అంటూ పరోక్షంగా విమర్శించారు. రాజకీయ బిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని ఇష్టానుసారంగా విమర్శించిన వారిని ఊరికినే విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బూతులు మాట్లాడితే…

Chandrababu Strong Warning To Kodali Nani

Chandrababu Strong Warning To Kodali Nani

ప్రత్యర్ధులు పారిపోతారు అని చంద్రబాబు పేర్కొన్నారు. నేను బూతులు మాట్లాడాలనుకుంటున్నా కానీ ఆ నీచమైన సంస్కృతి నాకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీతో ఆటలు ఆడొద్దు. నాలుగు సంవత్సరాలు రాష్ట్రంలో చీకటి పాలన సాగింది. “బాదుడే బాదుడు” తో మొదలయ్యి వీరబాదుడుతో ప్రజలను అనేక ఇబ్బందులకు జగన్ ప్రభుత్వం గురిచేస్తుంది అంటూ చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలో సంచలన స్పీచ్ ఇచ్చారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది