Chhatrapati Shivaji Maharaj : ఛత్రపతి స్పూర్తితో అంతరాలు లేని సమాజంకై కృషి చేయాలి : ఏఐవైఎఫ్
ప్రధానాంశాలు:
Chhatrapati Shivaji Maharaj : ఛత్రపతి స్పూర్తితో అంతరాలు లేని సమాజంకై కృషి చేయాలి : ఏఐవైఎఫ్
Chhatrapati Shivaji Maharaj : మత సామరస్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ మహారాజ్ Chhatrapati Shivaji Maharaj Jayanthi ని స్మరించుకొని ఆయన ఆశయాలు, లక్ష్యాల కోసమే పోరాడుదామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ పిలుపునిచ్చారు. Chhatrapati Shivaji ఛత్రపతి శివాజీ 395వ జయంతిని ఏఐవైఎఫ్ AIYF ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ లు సంయుక్తంగా మాట్లాడుతూ మహారాష్ట్రలో 16వ శతాబ్దంలో ఉన్న వైదిక, బ్రాహ్మణీయ ఆధిపత్య కులాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి…

Chhatrapati Shivaji Maharaj : ఛత్రపతి స్పూర్తితో అంతరాలు లేని సమాజంకై కృషి చేయాలి : ఏఐవైఎఫ్
Chhatrapati Shivaji Maharaj మత సామరస్యాన్ని పెంపొందించిన బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ : ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి
శూద్రులు రాజ్యానికి పరిపాలించడానికి వీలు లేదు అనే సంస్కృతిని ధిక్కరిస్తూ పిష్వాలా వ్యతిరేకంగా మహారాష్ట్రలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన శూద్ర కులాల, కార్మిక వర్గం ప్రజల ప్రతినిధి చత్రపతి శివాజీ అని వారు అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించక ముందు సిద్ధించిన తర్వాత కొంతమంది బ్రాహ్మణీయ భావజాలం కలిగిన రాజకీయ నాయకులు, పార్టీలు శివాజీని హిందూ ధర్మాన్ని, మతాన్ని ముస్లిం రాజుల నుంచి కాపాడిన వ్యక్తిగా ముస్లిం వ్యతిరేకిగా చరిత్రను వక్రీకరించారని ఆయన తెలిపారు. చత్రపతి సైన్యంలో అన్ని మతాలకు అన్ని కులాలకు సమానమైన ప్రాధాన్యం ఇచ్చేవారని దానిని అందరూ గుర్తించాలని అన్నారు. అదేవిధంగా శివాజీ తన రాజ్యంలో రైతుల సంక్షేమం కోసం కార్మికుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, సంక్షేమ విధానాలను తీసుకువచ్చి దున్నేవాడిదే భూమి అని భూమిని పంచిన చరిత్ర ఆయనకు ఉందని తెలిపారు.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత శివాజీని కొన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా బిజెపి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ మత సంస్థలు ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికి తప్పుడు సూత్రీకరణలు చేస్తున్నారని దానిని ప్రజలు గమనించాలన్నారు. జ్యోతిరావు పూలే,డాక్టర్ అంబేద్కర్, గోవింద్ పన్సారే లాంటి మహనీయులు శివాజీ వాస్తవ చరిత్రను తీసుకువచ్చే ప్రయత్నం చేశారని చత్రపతి శివాజీ లక్ష్యాలు, శూద్ర కులాలకు రాజ్యాధికారం, రైతుల, కార్మికుల సంక్షేమం కోసమే ప్రజలు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నేత సతీష్ కుమార్,ఏఐవైఎఫ్ జిల్లా నేతలు గిరి బాబు,సాయి, రాజు, విజయ్, అక్షయ్, సుదర్శన్, సీపీఐ ఉప్పల్ మండల కార్యవర్గ సభ్యులు నారా నర్సింహా తదితరులు పాల్గొన్నారు.