KCR : ఆంధ్రాలో మళ్లీ జగన్‌కి తిరుగులేదా? తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమన్నారో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : ఆంధ్రాలో మళ్లీ జగన్‌కి తిరుగులేదా? తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమన్నారో తెలుసా?

KCR : సీఎం కేసీఆర్ ఇటీవల ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోసం తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే అధికార బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామో చెబుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వందల్లో ఉన్న స్కీమ్స్ ను వెయ్యి రూపాయలకు తీసుకెళ్లాం. ఆర్థిక సౌష్ఠవం పెరిగిన తర్వాత రూ.2016 కు చేసుకున్నాం. క్రమంగా పెంచుకుంటూ వెళ్లాం. ఇప్పుడు కూడా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 October 2023,5:26 pm

KCR : సీఎం కేసీఆర్ ఇటీవల ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోసం తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే అధికార బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేస్తామో చెబుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వందల్లో ఉన్న స్కీమ్స్ ను వెయ్యి రూపాయలకు తీసుకెళ్లాం. ఆర్థిక సౌష్ఠవం పెరిగిన తర్వాత రూ.2016 కు చేసుకున్నాం. క్రమంగా పెంచుకుంటూ వెళ్లాం. ఇప్పుడు కూడా పెన్షన్ పెంచుతున్నాం. అందరికీ పెరుగుతాయి. జీతాలు కూడా పెరుగుతాయి కాబట్టి పింఛను కూడా పెంచుతున్నాం. పింఛనును రూ.5000 వరకు తీసుకెళ్తాం. సడెన్ గా వచ్చే రోజే ఐదు వేలు ఇవ్వడం కాదు. ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలో మార్చి తర్వాత రూ.3000 చేస్తాం. ప్రతి సంవత్సరం రూ.500 పెంచుకుంటూ వెళ్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

5 వ సంవత్సరం నిండే నాటికి రూ.5000 రూపాయలకు తీసుకెళ్తాం. దీని వల్ల ప్రభుత్వానికి భారం పడదు. ఫించన్ దారులకు కూడా బెనిఫిట్ లభిస్తుంది. ఏపీలో చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పద్ధతినే అవలంబిస్తోంది. అక్కడున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ ఫుల్ ఈ స్కీమ్ ను రూ.2000 తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు రూ.3000 కు చేరుకుంది. ఇక్కడ కూడా మేము ముందు రూ.3000 చేస్తం. ఆ తర్వాత క్రమం తప్పకుండా పెంచుకుంటూ వెళ్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంత అన్నపూర్ణ ఉన్నటువంటి రాష్ట్రం, అందుకే ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇక దొడ్డు బియ్యం బాధ ఉండదు. తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికి కూడా సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మార్చి తర్వాత వందకు వంద శాతం ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి దీమా అనే పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

cm kcr superb words about ys jagan schemes

#image_title

KCR : ఆసరా పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న సీఎం కేసీఆర్

ఆసరా పెన్షన్ల విషయంలో సీఎం కేసీఆర్, ఏపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని.. సీఎం జగన్ పేదల కోసం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారని.. వృద్ధులకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నారని సీఎం కేసీఆర్ కొనియాడారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది