Puvvada Ajay Kumar : ఖమ్మంలో పువ్వాడకు కాంగ్రెస్ భారీ షాక్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Puvvada Ajay Kumar : ఖమ్మంలో పువ్వాడకు కాంగ్రెస్ భారీ షాక్?

 Authored By kranthi | The Telugu News | Updated on :20 October 2023,8:00 pm

Puvvada Ajay Kumar : ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పటికీ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేది తెలంగాణకు గుండెకాయ వంటిది. అటు ఆంధ్రాకు సరిహద్దున ఉండటంతో ఈ జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు మళ్లుతాయో ఎవ్వరూ ఊహించలేదు. అందులోనూ ఈ మధ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన చాలామంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో ఖమ్మం రాజకీయాలు మొత్తం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద పడింది. ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నప్పటికీ.. ఇవి ఎమ్మెల్యే ఎన్నికలు కావడంతో ఆయన జోక్యం చేసుకోవడం లేదు. ఖమ్మం రాజకీయాలు మొత్తం పువ్వాడే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తోంది.

ఇప్పటికే పొంగులేటి, తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలామంది కీలక నేతల అనుచరులు కూడా వాళ్లతో పాటే ఇతర పార్టీలకు జంప్ అయ్యారు. దీంతో పువ్వాడకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్ లు అందజేస్తుంటే.. ఇక్కడ ఖమ్మంలో ఉన్న కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. దీంతో పువ్వాడకు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతూ ఉండటంతో పువ్వాడకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

congress big shock to puvvada ajay kumar in khammam

#image_title

Puvvada Ajay Kumar : షర్మిల కూడా బీఆర్ఎస్ కు పోటీగా

ఇదంతా పక్కన పెడితే చివరకు వైఎస్సార్టీపీ పార్టీ కూడా బీఆర్ఎస్ కు షాకులు ఇస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఖమ్మం జిల్లాలోనే పోటీ చేయబోతున్నారు. తన తల్లి, భర్త అనీల్ ను కూడా పోటీలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు చాలామంది ఉన్నారు. షర్మిల అక్కడ పోటీ చేయడం వల్ల.. బీఆర్ఎస్ కు పడే ఓట్లు చీలిపోతాయని.. అవి షర్మిల వైపు మళ్లుతాయని.. దాని వల్ల బీఆర్ఎస్ కు చాలా వరకు ఓట్ల శాతం తగ్గుతుందని అంటున్నారు. చూడాలి మరి.. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ ఎలా నెగ్గుకొస్తుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది