Free Electricity : 200 యూనిట్ల విద్యుత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన… వచ్చే నెల నుంచి అమల్లోకి…!
ప్రధానాంశాలు:
Free Electricity : 200 యూనిట్ల విద్యుత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన... వచ్చే నెల నుంచి అమల్లోకి...!
Free Electricity : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలల కావస్తోంది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీ లల్లో రెండు హామీలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. యువత అభివృద్ధి తప్ప మిగిలిన హామీల కోసం ప్రత్యేక సభలు నిర్వహించే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను తీసుకున్నారు. వాటికసరత్తు జరుగుతుంది. అయితే హామీల జాప్యం జరుగుతుండడంతో ప్రజల్లో అసహనం పెరుగుతుంది. ముఖ్యంగా ఉచిత విద్యుత్ లాంటి హామీల విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అంటూ పదే పదే మాటలు వినిపిస్తున్నాయి..
అయితే రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే మరో హామీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీలో ఫ్రీ బస్సు ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేసిన ప్రభుత్వం. 200 యూనిట్లు ఉచిత పథకాన్ని అమలు చేయనుంది. ఫిబ్రవరి నెల నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చితామని 100 రోజుల్లో అమలు చేసి తిడతామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కోటి 31 లక్షల 48వేల డొమెస్టిక్ విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్లు లోపు వాడేవి దాదాపు కోటి వరకు ఉంటాయి. ఈ కనెక్షన్ల నుంచి ప్రతినెల కరెంటు బిల్లులపై విద్యుత్ పంపిన సంస్థలకు సుమారు 350 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.
కోటి కనెక్షన్లు ఉచితంగా ఇస్తే ఖర్చు ఎంత డిస్కములకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు.7.07 రూపాయలు ఖర్చవుతుంది. అయితే 200 యూనిట్ల వినియోగించే వారికి ప్రస్తుతం సగటు వేయకంటే తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వినియోగాన్ని బట్టి ఏడాదికి 4200 కోట్లు డిస్కములకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్ సప్లై కాస్ట్ ప్రకారం చెల్లించాల్సివస్తే ఇంకా ఎక్కువ నిధులు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఉచిత కరెంటు పొంది కలెక్షన్ల వివరాలు నమోదు కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ పథకం పొందాలనుకునేవారు కరెంట్ కనెక్షన్ల వివరాలన్నీ పోర్టల్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు..