Congress : మొదటికే కాంగ్రెస్ పరిస్థితి.. ఓటమికి గల కారణాలని అన్వేషించే పనిలో రాహుల్
ప్రధానాంశాలు:
Congress : మొదటికే కాంగ్రెస్ పరిస్థితి.. ఓటమికి గల కారణాలని అన్వేషించే పనిలో రాహుల్
Congress : ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉండి ఓ ఊపు ఊపేసింది. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మహారాష్ట్రలో ఘోర పరాజయం.. హరియాణాలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయమని సర్వేలు ఘంటా పథంగా ప్రకటించిన చోటా.. కుప్పకూలడం.. ఇక, జమ్ము కశ్మీర్‌లో మేలిమి ఓటు బ్యాంకు కునారిల్లడం.. ఇవీ.. గత ఆరు మాసాల్లో అతి పురాతన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అతి పెద్ద అపజయాలు, పరాభవాలు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. అసలు ఓటమికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది.
Congress వారికి హితబోధ..
ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమికి.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లోపించడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని.. వచ్చే ఎన్నికల్లో విజయాలు సాధించాలంటే.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భేటీ అయిన సీడబ్ల్యూసీ కొన్ని తీర్మానాలు చేసింది. చేతులు కాలే వరకువెయిట్ చేసి.. ఆ తర్వాత ఆకులు పట్టుకునే తరహాలో కాంగ్రెస్ పార్టీ వడివడిగా విజృంభిస్తోంది. మరో రెండు మాసాల్లో కీలకమైన ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయినా.. పార్టీలో వ్యవస్థీకృత మార్పుల దిశగా అడుగులు పడడం లేదు.
కాంగ్రెస్ లో క్రమ శిక్షణ సన్నగిల్లడం, నాయకులలో నిబద్ధత లేకుండా పోవడం, వ్యక్తిగత అజెండాలు పెరిగిపోవడం, అంతర్గత కుమ్ములాటలు , నాయకులు యాంత్రీకరణ కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలు అని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇవే కాంగ్రెస్ పార్టీ కొంపముంచాయని, మున్ముందు ఇండియా కూటమిపైనా ప్రభావం చూపుతాయని అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారుతున్న నాయకులను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారని, ప్రజల నాడిని పట్టుకోలేక పోతున్నారని చెప్పినా.. ఖర్గే నుంచిరాహుల్ వరకు అంతా మాకు తెలుసు! అన్నట్టే వ్యవహరించారు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకున్నా.. అవే విషయాలు కనిపిస్తున్నాయి. “మనం కఠినమైన క్రమశిక్షణను పాటించడం ముఖ్యం. ప్రతి సందర్భంలోనూ ఐక్యంగా ఉండాలి. పార్టీకి క్రమశిక్షణ అనేది ఆయుధం. కలసికట్టుగా ఉంటేనే గెలుస్తాం. విడిపోతే పడిపోతాం. పార్టీ బలంగానే ఉంటేనే మనం బలంగా ఉంటాం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని ఖర్చే అన్నారు.