Congress : కాంగ్రెస్ కర్ణాటక స్కెచ్.. గెలుపు వ్యూహం రెడీ?

Advertisement

Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరుమీదుంది. దానికి కారణం.. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అనేది పార్టీకి దేశవ్యాప్తంగా ప్లస్ పాయింట్ అయింది. అదే ఊపుతో తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ముఖ్య కారణం అంటే డీకే శివకుమార్ అనే చెప్పుకోవాలి. అందుకే తెలంగాణలోనూ ఎన్నికల కోసం ఆయన్నే ఎన్నికలకు మెయిన్ నాయకుడిగా నిర్ణయించి తెలంగాణలో ఎన్నికలను చూసుకునే పనిని హైకమాండ్ అప్పగించింది.

Advertisement
congress party winning strategy ready in telangana
congress

అందుకే ఇక అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తెలంగాణలో ముందడుగేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాన్ని రెడీ చేసింది. తెలంగాణలో విజయం కోసం కర్ణాటక ప్లాన్ ను అమలు చేస్తోంది. పక్కా ప్రణాళికను రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ జాతీయ నేతలు అందరూ హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఏఐసీసీ మీటింగ్ కూడా ఇక్కడే నిర్వహించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా హైదరాబాద్ లోనే నిర్వహించారు. ఇక.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ రాబోతున్నారు.

Advertisement

Congress : కర్ణాటకలో ఇచ్చిన హామీలే ఇక్కడ ఇవ్వబోతున్నారా?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక కారణం హామీలు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్లే కాంగ్రెస్ అక్కడ గెలిచింది. అవే హామీలను ఇక్కడ కూడా ఇచ్చి తెలంగాణలో గెలవాలని వ్యూహం రచిస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలోనూ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో సోనియా పర్యటన ఉన్న నేపథ్యంలో ఆమె ఎలాంటి హామీలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement