Addanki Dayakar : ఆ మూడు కారణాలతో అద్దంకిని పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Addanki Dayakar : ఆ మూడు కారణాలతో అద్దంకిని పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం..!

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Addanki Dayakar : ఆ మూడు కారణాలతో అద్దంకిని పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం..!

Addanki Dayakar : అద్దంకి దయాకర్ ను కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల జాబితా నుండి చివరి నిమిషం లో ఆయనను హై కమాండ్ పక్కన పెట్టింది. మొదట్లో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ఖరారు అయినట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ను అద్దంకి త్యాగం చేశారు. దానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ప్రచారం పెరిగిపోయింది. దాంతో నేతలు, క్యాడర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే చివరి నిమిషంలో అద్దంకి ప్లేస్ లోకి మహేష్ కుమార్ గౌడ్ చేరారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి, గౌడ్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. అయితే చివరి నిమిషంలో అద్దంకిని ఎందుకు తప్పించారు అనే విషయంలో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

అద్దంకిని తప్పించినందుకు రెండు మూడు కారణాలను పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. మొదటిది అద్దంకికి పీసీసీ అధ్యక్ష పదవి రాబోతుందని, రెండవది క్యాబినెట్ ర్యాంకు ఉండే కార్పొరేషన్ పదవి ఇవ్వబోతున్నారని, మూడవది తొందరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుండి పోటీ చేయబోతున్నారన్నది. వాస్తవానికి ఎమ్మెల్సీ తో పోల్చుకుంటే క్యాబినెట్ ర్యాంకుతో కార్పొరేషన్ పదవి అన్నది చిన్నది. ఇక పీసీసీ అధ్యక్ష పదవి అన్నది అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవికి పెద్దగా గుర్తింపు ఉండదు. పైగా రేవంత్ రెడ్డి లాంటి దూకుడు స్వభావం ఉన్న నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి కేవలం అలంకారప్రాయమే అవుతుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పీసీసీ అధ్యక్ష పదవికి బాగా ప్రాముఖ్యత ఉంటుంది.

నిర్ణయాలు అధిష్టానంతో చర్చించిన తర్వాతే తీసుకోవాల్సిచ్చిన అమలు చేయాల్సింది పీసీసీ అధ్యక్షుడే కాబట్టి బాగా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక వరంగల్ పార్లమెంట్ పోటీ విషయంలో ఆ సీటు ఇస్తే అతడు గెలుచుకుంటే అది మంచిది. ఎందుకంటే ఎమ్మెల్సీ కంటే అదే బెటర్. పైగా రేవంత్ రెడ్డికి అనుకూలుడు అయిన దయాకర్ ఢిల్లీలో తన మనిషిగా నిత్యం అందరితో టచ్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్కు అవకాశం ఇవ్వవచ్చు. లేదంటే ఎమ్మెల్సీ గా పోటీ చేపించవచ్చు. ఎమ్మెల్సీ తో పోల్చుకుంటే కార్పొరేషన్ పదవి చిన్నదే అయితే అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా లేక పార్లమెంట్ కు పోటీ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది