Kavitha Revanth Reddy : కాంగ్రెస్‌తో కవిత రాయబారం మొదలు పెట్టిందా.. రేవంత్ ఏమన్నాడంటే..!
ప్రధానాంశాలు:
Kavitha Revanth Reddy : కాంగ్రెస్‌తో కవిత రాయబారం మొదలు పెట్టిందా.. రేవంత్ ఏమన్నాడంటే..!
Kavitha Revanth Reddy : కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేశారా!? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు ‘నో’ చెప్పిందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కవిత కాంగ్రెస్ లోకి వచ్చేందుకు చేసిన ప్రతిపాదన పైన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సీఎం రేవంత్ .. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో చర్చించినట్లు తెలుస్తోంది.

Kavitha Revanth Reddy : కాంగ్రెస్‌తో కవిత రాయబారం మొదలు పెట్టిందా.. రేవంత్ ఏమన్నాడంటే..!
Kavitha Revanth Reddy ఏం జరగబోతుంది..
ఈ సమయంలో రేవంత్ తన అభిప్రాయం ఏంటో హైకమాండ్ ముందు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని అభిప్రా యపడినట్లు సమాచారం. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళతాయనే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకీభవించింది.
ఫలితంగా కాంగ్రెస్ లోకి ఇప్పటికిప్పుడు కవితకు ఎంట్రీ లేదనేది స్పష్టం అవుతోంది. దీంతో, కవిత జూన్ 2న కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ కేసీఆర్, హరీశ్ రావు తదితరులు పదే పదే ప్రకటనలు చేశారు. దీంతో, అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారు. పదిమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు. అప్పట్లోనే, గ్రేటర్ సహా రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేల చేరికకూ రంగం సిద్ధమైంది.