Telangana Elections Results 2023 : రేపే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు.. ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం

Authored By aruna | The Telugu News | Updated on: December 3, 2023, 7:36 pm
  •  Telangana Elections Results 2023 : రేపే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు..

  •  ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం

  •  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు

Telangana Congress :  Telangana Elections Results 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు,  తెలంగాణలో స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ సాధించింది. కాంగ్రెస్ 64 స్థానాలను సాధించి మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది. బీఆర్ఎస్ 36 సీట్లు సాధించి, 3 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక.. బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర పార్టీలు ఒక స్థానాన్ని సాధించాయి. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన స్థానాలు 60 మాత్రమే.

మ్యాజిక్ ఫిగర్ 60 కంటే 4 సీట్లను కాంగ్రెస్ ఎక్కువే సాధించింది. దీంతో వేరే ఏ ఇతర పార్టీల మద్దతు కూడా అవసరం లేకుండా సింగిల్ పార్టీగా తెలంగాణలో అధికారాన్ని ఏర్పాటు చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ.ముందుగా డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని అంతా భావించారు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. కానీ.. తెలంగాణలో రేపే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఉండనుంది. ఈరోజు రాత్రే తాజ్ కృష్ణ హోటల్ లో సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరగబోయే సీఎల్పీ సమావేశంలో సీఎం ఎవరో తెలిసే అవకాశం ఉంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp