Gas Cylinder : డిసెంబర్ 31వ తేదీ లోపు ఇలా చేయండి .. లేదంటే సబ్సిడీ ఆగిపోతుంది…!
ప్రధానాంశాలు:
Gas Cylinder : డిసెంబర్ 31వ తేదీ లోపు ఇలా చేయండి .. లేదంటే సబ్సిడీ ఆగిపోతుంది...!
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ని పొందడానికి ఈ – కేవైసీ చేయించుకోవాలని అధికారులు ప్రకటించారు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ ఉండదు అని తెలిపారు. గ్యాస్ ఉపయోగించే కష్టమర్లు తమ ఆధార్ కార్డు బయోమెట్రిక్ మిషన్ ను ఉపయోగించి ఈ – కేవైసీ కోసం వారి సంబంధిత గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ- కేవైసీ సేవ గ్యాస్ కార్యాలయం లో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. నిర్ణీత గడువు కంటే ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత సబ్సిడీలు వస్తాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అర్హులకు మాత్రమే గ్యాస్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. సబ్సిడీ వ్యవస్థ సామర్థ్యాన్ని మార్గదర్శకతను పెంచుతుందని ఈ పద్ధతిని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 25న ప్రారంభించిన ఈ – కేవైసీ ప్రక్రియ డిసెంబర్ 30 తో ముగియనుంది. ఇక ఈ – కేవైసీ ని ఇంట్లో కూడా పూర్తి చేయవచ్చు.
* ముందుగా ఎల్పిజి గ్యాస్ అధికారిక వెబ్సైట్ www.mylpg.in లోకి వెళ్ళాలి.
* ఆ తర్వాత అక్కడ కుడివైపు ఉన్న గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
* అందులో కుడివైపు పైన సైన్ ఇన్ న్యూ యూజర్ ఆప్షన్ కనిపిస్తుంది.
* ఒకవేళ ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నెంబర్ తో సైన్ ఇన్ అవ్వాలి లేదంటే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* తర్వాత గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ సహా అడిగిన వివరాలను సమర్పించాలి.
* ఆ తర్వాత ఐడి తో లాగిన్ అవ్వాలి.
* ఇప్పుడు స్క్రీన్ పై గ్యాస్ కనెక్షన్ కు సంబంధించిన వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి.
* ఎడమవైపు కనిపించే ఆధార్ అదేంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటిపి పై క్లిక్ చేయాలి. * అనంతరం రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అథెంటిఫికేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి…
* ఆ తర్వాత విజయవంతంగా అథెంటికేషన్ పూర్తి అయినట్లు మెసేజ్ వస్తుంది.
* స్టేటస్ తెలుసుకోవాలంటే మరోసారి క్లిక్ చేయాలి. అప్పుడు ఈకేవైసీ ఇప్పటికే పూర్తి చేశారు అని మెసేజ్ వస్తుంది.
* ఆఫ్ లైన్లో అయితే సంబంధిత ఫారం ఫిలప్ చేసి గ్యాస్ ఏజెన్సీ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో కేవైసీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.