Donald Trump PM Modi : ట్రంప్‌తో మోదీ కీలక భేటిలో ఆసక్తికర చర్చలు.. కీలక అంశాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Donald Trump PM Modi : ట్రంప్‌తో కీలక భేటిలో ఆసక్తికర చర్చలు.. కీలక అంశాలు ఇవే..!
Donald Trump PM Modi : అగ్రరాజ్యం అమెరికాకి ట్రంప్ Donald Trump మరోసారి అధ్యక్షుడు అయిన తర్వాత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. PM Modi ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ప్రధానితో పాటు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో టారిఫ్‌లు, వలసలు, భారత్-అమెరికా వ్యూహాత్మక అంశాలపై ఇరువురూ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Donald Trump PM Modi : ట్రంప్‌తో మోదీ కీలక భేటిలో ఆసక్తికర చర్చలు.. కీలక అంశాలు ఇవే..!
Donald Trump PM Modi : సక్సెస్ ఫుల్ టూర్..
సుంకాలు, వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో భారత్-అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించబోతున్నాయని వెల్లడించారు. భారత్ కు అధునాతన ఎఫ్-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది.. ఈ ఏడాది నుంచి భారత్‌కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను కూడా పెంచుతామని ట్రంప్ అన్నారు.
ఇక భారత్, అమెరికా కలిసి వేగంగా అభివృద్ధి చెందుతాయని ప్రధాని మోదీ అన్నారు. అదే సమయంలో మీ రాక నాకు గౌరవం అని డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో అన్నారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అమెరికా నుంచి భారత్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్ఢ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ , వివేక్ రామస్వామి తదితరులతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు.