Etela Vs Kcr : ఈటల నియోజకవర్గంలో గెలుస్తామో లేదో అనే టెన్షన్ తో సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారంటే?..
Etela Vs Kcr : ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నియోజకవర్గం హుజూరాబాద్ లో ఏ పార్టీ గెలవబోతోందనే ఆసక్తి, ఉత్కంఠ ఇప్పటి నుంచే నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి కొంచెం టెన్షన్ గా కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఉపఎన్నిక పోరును ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్’గా పేర్కొనొచ్చు. ఇద్దరికీ ఇది ఇగోతో కూడిన వ్యవహారమనే సంగతి అందరికీ తెలిసిందే. ఈటల రాజేందర్ […]
Etela Vs Kcr : ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నియోజకవర్గం హుజూరాబాద్ లో ఏ పార్టీ గెలవబోతోందనే ఆసక్తి, ఉత్కంఠ ఇప్పటి నుంచే నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి కొంచెం టెన్షన్ గా కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఉపఎన్నిక పోరును ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్’గా పేర్కొనొచ్చు. ఇద్దరికీ ఇది ఇగోతో కూడిన వ్యవహారమనే సంగతి అందరికీ తెలిసిందే. ఈటల రాజేందర్ ఇన్నాళ్లూ కేసీఆర్ ఫొటోతోనే గెలిచాడని గులాబీ పార్టీవాళ్లు గుర్తుచేస్తున్నారు. కారు పార్టీకి తన ఇమేజ్ సైతం తోడవటంతోనే నెగ్గానని ఈటల రాజేందర్ కౌంటర్లు వేస్తున్నారు. అందువల్ల ఈ బైఎలక్షన్ ని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండూ ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి.
నిఘా పెట్టిన..
సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సెగ్మెంట్ లో జనాల పల్స్ ని పట్టుకోవటానికి ఇంటలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపారు. తన సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఉప ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఒక వేళ బీజేపీకే ఓటు వేయాలనుకుంటుంటే ఎందుకు?. ఈటల రాజేందర్ గెలిస్తే అదనంగా సమకూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?. ఈటల రాజేందర్ పై మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్నలు అడుగుతూ వాటికి ప్రజలు చెప్పే సమాధానాలను నిఘా వర్గాలు వెంటనే సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి తెలియజేస్తున్నారు.
పబ్లిక్ టాక్.. : Etela Vs Kcr
నిఘా వర్గాలను హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి పది మంది చొప్పున నియమించారు. నెల రోజులుగా ఇదే పనిలో ఉన్న ఆ టీమ్స్ జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో తిష్ట వేస్తూ వాళ్లు పాలిటిక్స్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ రిపోర్టులను రూపొందిస్తున్నాయి. ఖాళీగా కూర్చునే జనాలు టైం పాస్ కోసం పిచ్చాపాటిగా మాట్లాడుతుంటారు. ఆ ముచ్చట్లనే ఇంటలిజెన్స్ వర్గాలు పూసి గుచ్చినట్లు పట్టేస్తున్నాయి. పనిలో పనిగా ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే డేటానీ సేకరిస్తున్నాయి.
ముమ్మరంగా..
మరో వైపు ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తెల్లారి నుంచే తన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. కార్యకర్తలతో, స్థానికులతో నిత్యం మీటింగులు పెడుతున్నారు. ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున కూడా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీంతో ఈటల అనుచరుల కదలికలపై నిఘా వర్గాలు ఫోకస్ పెట్టాయి. అదే సమయంలో ఇటు టీఆర్ఎస్ లో ఉంటూనే పరోక్షంగా ఈటల వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నవారిని సైతం ఇంటలిజెన్స్ వర్గాలు పసిగడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ నిఘా సిబ్బంది రూలింగ్ పార్టీకి కావాల్సిన సమస్త సమాచారాన్నీ సేకరించి పెడుతోంది.