BRS : మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్.. వేరే రాష్ట్రంలో సత్తా చాటిన పార్టీ.. ఇదీ కేసీఆర్ సత్తా అంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BRS : మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్.. వేరే రాష్ట్రంలో సత్తా చాటిన పార్టీ.. ఇదీ కేసీఆర్ సత్తా అంటే

BRS : బీఆర్ఎస్ పార్టీ ఏమో అనుకున్నారు అందరూ. ఈసారి తెలంగాణ ఎన్నికల్లోనే గెలిచే సత్తా లేదు అని అంతా అనుకుంటున్నారు కానీ.. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాదు.. అక్కడ కాదు ఏకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచింది. తన సత్తా చాటింది. అసలు వేరే రాష్ట్రాల్లో ఈ పార్టీని ఎవరు పట్టించుకుంటారు అని అన్న వాళ్లందరి నోళ్లు మూయించింది బీఆర్ఎస్ పార్టీ. అవును.. మహారాష్ట్రలో బోణీ కొట్టేసింది. భండారా జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :6 November 2023,7:44 pm

ప్రధానాంశాలు:

  •  మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ

  •  విదర్భ, సోలాపూర్ లో 15 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్

  •  భండారా జిల్లాలో 20 గ్రామ పంచాయతీలను సాధించిన బీఆర్ఎస్

BRS : బీఆర్ఎస్ పార్టీ ఏమో అనుకున్నారు అందరూ. ఈసారి తెలంగాణ ఎన్నికల్లోనే గెలిచే సత్తా లేదు అని అంతా అనుకుంటున్నారు కానీ.. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాదు.. అక్కడ కాదు ఏకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచింది. తన సత్తా చాటింది. అసలు వేరే రాష్ట్రాల్లో ఈ పార్టీని ఎవరు పట్టించుకుంటారు అని అన్న వాళ్లందరి నోళ్లు మూయించింది బీఆర్ఎస్ పార్టీ. అవును.. మహారాష్ట్రలో బోణీ కొట్టేసింది. భండారా జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పలు స్థానాలను గెలుచుకుంది. భండారా జిల్లాలోని 66 గ్రామ పంచాయతీలకు గాను 20 గ్రామ పంచాయతీల్లో ఫలితాలు రాగా… అందులో తొమ్మిది గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకుంది.

భండారాలో బీజేపీకి మద్దతు ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు ఉంటుంది. కానీ.. వాటిని దాటుకొని బీఆర్ఎస్ పార్టీ 9 గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. బీజేపీ, కాంగ్రెస్ రెండు గ్రామ పంచాయతీలను గెలుచుకోగా, ఎన్సీపీ ఒక్క  గ్రామ పంచాయతీని సాధించింది. ఇక.. విదర్భ, సోలాపూర్ ప్రాంతాల్లో కూడా ఫలితాలు ప్రకటించగా.. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలను గెలుచుకున్నది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది