Etela Rajender : నేను అందుకే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నా.. అసలు కారణం చెప్పి ఏడ్చేసిన ఈటల రాజేందర్
ప్రధానాంశాలు:
నేను తిప్పతీగ తినేలా చేసిండు
ధర్మం గెలవడం కోసమే అక్కడ పోటీ చేస్తున్నా
బతికుండగానే నరకం చూపించిండు
Etela Rajender : బీజేపీ నేత ఈటల రాజేందర్.. హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ పోటీ చేస్తున్నారు. కేసీఆర్ పై గజ్వేల్ లో ఈటల పోటీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈటల గురించి తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. హుజురాబాద్ లోనే గెలిచే చాన్స్ లేదు. హుజురాబాద్ లో ఈ సారి ఈటలను ఓడిస్తాం అని ఓపక్క మంత్రి కేటీఆర్ చెబుతుంటే.. మరోవైపు గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడిస్తా అని ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఇవాళ హుజురాబాద్ లో నామినేషన్ వేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. అసలు తాను ఎందుకు గజ్వేల్ కు వెళ్లానో.. గజ్వేల్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నానో అసలు కారణం చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. మాట్లాడుతూనే ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు ఈటల రాజేందర్. నన్ను ఆ రోజు ఉపఎన్నికల్లో ఓడించాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ మీ వల్ల కాలేదు. కానీ.. నేను యుద్ధం సమఉజ్జీలతో పోటీ చేస్తా. మొన్న హుజురాబాద్ లో మీటింగ్ పెట్టి.. ఈటలను గెలిపించారు కదా.. ఏం చేసిండు అంటూ మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో తళతళ మెరుస్తున్న రోడ్లను ఎవరు వేశారు అంటూ ప్రశ్నించారు ఈటల. దీంతో మీరే.. అంటూ జనాలు అరిచారు.
నేను నిబద్ధత ఉన్న కార్యకర్తను. నా కొడుకు రాజకీయాల్లో లేడు. నా బిడ్డ రాజకీయాల్లో లేదు. కానీ.. వాళ్లు మాత్రం కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. గజ్వేల్ కు నేను ఎందుకు వెళ్లాను. ఇక్కడ నాకు దిక్కు లేక నేను అక్కడికి వెళ్లలేదు. నాకు మీమీద ప్రేమ లేక కాదు. వాళ్లకు తెలియాలి.. అందుకే అక్కడికి వెళ్లాను. అక్కడి నుంచి పోటీ చేస్తున్నా. నాకు నరకం చూపించారు. నన్ను పార్టీలో చాలా ఇబ్బంది పెట్టారు. హుజురాబాద్ లో నన్ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ.. వాళ్ల వల్ల కాలేదు అని ఈటల స్పష్టం చేశారు.
Etela Rajender : ధర్మాన్ని కాపాడటానికే రెండు చోట్ల పోటీ చేస్తున్నా
ధర్మాన్ని కాపాడటానికే నేను రెండు చోట్ల పోటీ చేస్తున్నా. నన్ను ఏం చేయలేరు.. హుజురాబాద్ కాదు కదా.. గజ్వేల్ లో కూడా గట్టి పోటీ చేస్తా. నన్ను చాలా ఇబ్బందులు పెట్టాలని చూశారు. నాకు షుగర్ వస్తే ఏదో తిప్ప తీగ ఆకులు తింటే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టారు. నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టిన వాళ్లకు ఎదురు వెళ్లాలి కదా. అందుకే గజ్వేల్ లో పోటీ చేస్తున్నా అని ఈటల స్పష్టం చేశారు.