Bonthu Rammohan : తన అక్రమ ఆస్తుల విషయంపై క్లారిటీ ఇచ్చిన బొంతు రామ్మోహన్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bonthu Rammohan : తన అక్రమ ఆస్తుల విషయంపై క్లారిటీ ఇచ్చిన బొంతు రామ్మోహన్…!

 Authored By aruna | The Telugu News | Updated on :21 February 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Bonthu Rammohan : తన అక్రమ ఆస్తుల విషయంపై క్లారిటీ ఇచ్చిన బొంతు రామ్మోహన్...!

Bonthu Rammohan : ఎక్స్ మేయర్ బొంతు రామ్మోహన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆయనపై అక్రమంగా ఆస్తి సంపాదన గురించి వచ్చిన ఆరోపణల పై క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా పలు రకాల విషయాల గురించి మీడియాతో ముచ్చటించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ ఆమోదించిన చట్టబద్ధమైన సంస్థలు చాలా ఉన్నాయి. అదే సంస్థలలో అదే మీడియాలో, కొన్ని వందల ఎకరాలు సంపాదించినట్లుగా వార్తలు వచ్చేవని తెలియజేశారు. ఈరోజు బొంతు రామ్మోహన్ సంపాదించాడా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి సిబిఐ , ఏసీబీలు ఉన్నాయి. నేను సంపాదించానో లేదో తెలుసుకోవడానికి ఇలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. అదిగో పిల్లి అంటే ఇదిగో పులి అన్నట్లు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజంగానే అక్రమ ఆస్తులు ఉంటే పలానా ప్రాంతానికి వెళ్లి ఆ బిల్డింగ్ ఎవరిది కాలేజ్ ఎవరిది ఆస్తి ఎవరిది అని ఆరా తీస్తే చెప్తారు కదా. కానీ అలాంటివి ఏమీ లేకుండా గాల్లో మేడలు కట్టి బొంతు రామ్మోహన్ అంత సంపాదించిండు వందల కోట్లు సంపాదించాడంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు.

అలాగే నాకు అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా ఎవరైనా కంప్లైంట్ చేశారా… నిజంగా దొరికే దొంగలను వదిలిపెట్టి నా మీద తప్పుడు ప్రచారం చేయడంలో లాభమేంటి అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.. అదేవిధంగా ఈమధ్య ఓ యూట్యూబ్ ఛానల్ ఎవరో బిల్డింగ్ దగ్గరికి వెళ్లి ఈ బిల్డింగ్ బొందు రామ్మోహన్ ది అని చెబుతున్నారు. అయితే కనీసం అది నిజమేనా కాదా అని తెలుసుకోకుండా కనీసం ఆ ఓపిక కూడా లేకుండా అయిపోయింది మీడియా కంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ మీ ఇన్నేళ్ల జీవితంలో ఇన్నేళ్ల జర్నీలో మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుండి పదవి నుండి దిగిపోయిన వరకు అ హైదరాబాద్ కు సంబంధించి అక్రమా ఆస్తులు ఏమి లేవా అని ప్రశ్నించింది. ఇక దానికి బొంతు రామ్మోహన్ సమాధానం ఇస్తూ ,భూతద్దం పెట్టి హైదరాబాద్ నగరం మొత్తం వెతుకులాడిన కూడా నా పేరు మీద అలాంటివేమి ఉండవు అంటూ ఆయన చెప్పకు వచ్చారు.

బయట పెడతాము కచ్చితంగా ఆధారాలుతో ప్రూవ్ చేస్తాము అనే వారికి మీ సమాధానమేంటి…? అలాగే మీ అక్రమ ఆస్తులు బయటపడతాయని మీరు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లారని పలువురు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి అని బొంతు రామ్మోహన్ ను అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ…బయటపడతాయి అని భయం ఉన్నోడికి అన్నీ బయటపడుతూనే ఉంటాయి. నాకు అక్రమ ఆస్తులు లేవని నేను ఇప్పటినుండి కాదు మేయర్ అయినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను అంటూ తెలియజేశారు. అయితే నా మేయర్ పదవి ముగిసి మూడు సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యకాలంలో నాపై ఏవైనా అక్రమ ఆస్తులు దొరికాయి అంటే ఒకటి కూడా లేదు. ఏదో రాజకీయంగా నాపై ఆరోపణలు తప్ప వాటిలో ఒక్కటి కూడా వాస్తవం కాలేదు అంటూ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది