Flying Taxi : చైనాలో ఎగిరే ట్యాక్సీ లు వచ్చేసాయి.. ఎలా ఉన్నాయో చూడండి..!
ప్రధానాంశాలు:
Flying Taxi : చైనాలో ఎగిరే ట్యాక్సీ లు వచ్చేసాయి.. ఎలా ఉన్నాయో చూడండి..!
Flying Taxi : టెక్నాలజీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చైనా పౌర విమానయాన విభాగం (Civil Aviation Administration of China – CAAC) పైలట్‌లేమి లేకుండా నడిచే ఫ్లయింగ్ టాక్సీలకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా చైనా, ఆటోనామస్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఫ్లయింగ్ కార్స్, డ్రోన్ టాక్సీలను అభివృద్ధి చేసే ఇహాంగ్ (EHang) & హెఫీ హే ఎయిర్లైన్స్ (Hefei Hai Airlines) సంస్థలు తమ టెస్టింగ్ దశను పూర్తి చేసుకుని ప్రయాణికుల రవాణా కోసం అధికారిక అనుమతి పొందాయి.

Flying Taxi : చైనాలో ఎగిరే ట్యాక్సీ లు వచ్చేసాయి.. ఎలా ఉన్నాయో చూడండి..!
Flying Taxi చైనాలో మెుదలైన ఎగిరే ట్యాక్సీ సేవలు
ఫ్లయింగ్ టాక్సీలు, ప్రధానంగా రద్దీగా ఉండే నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఉపయోగపడతాయి. పైలట్ లేకుండా స్వయంచాలకంగా నడిచే ఈ వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ (eVTOL – Electric Vertical Take-Off and Landing) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. శక్తిని తగ్గిస్తూ, సమయాన్ని ఆదా చేసే ఈ ఫ్లయింగ్ టాక్సీలు రాబోయే రోజుల్లో మెట్రో నగరాల్లో విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. చైనాలో ఇప్పటికే కొన్ని నగరాల్లో పరీక్షించబడిన ఈ టాక్సీలు, ప్రయాణికుల నుండి సానుకూల స్పందనను పొందాయి.
ఈ కొత్త టెక్నాలజీతో చైనా ట్రాన్స్‌పోర్ట్ రంగంలో కీలక ముందడుగు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఫ్లయింగ్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. అమెరికా, యూరప్, దుబాయ్ వంటి నగరాలు ఇప్పటికే ఈ రంగంలో ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.
చైనాలో ఫ్లయింగ్ టాక్సీలు.
చైనా పౌర విమానయాన విభాగం ఫ్లయింగ్ టాక్సీలకు అనుమతి.
ఇహాంగ్ & హెఫీ హే ఎయిర్లైన్స్ సంస్థలు పైలట్‌లేమి లేకుండానే వీటిని నడిపేందుకు గ్రీన్ సిగ్నల్. #FlyingTaxi #China #FutureOfTravel #TechInnovation pic.twitter.com/1b65ioczlb
— greatandhra (@greatandhranews) April 1, 2025