Ys Jagan : గన్నవరం లో పెద్ద వార్ మొదలైంది .. జగన్ రంగంలోకి దిగాల్సిందే !
Ys Jagan : ఏపీ రాజకీయాలలో గన్నవరం నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళ్తే 2019 ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే. టీడీపీ అభ్యర్థిగా నిలబడి విజయకేతనం ఎగరవేశారు. ఇక అదే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో ఓటమి చెందడం జరిగింది. అయితే వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రాష్ట్రంగా రాజకీయ సమీకరణాల పూర్తిగా మారడంతో పల్లవి వంశీ వైసీపీకి మద్దతు తెలుపటం జరిగింది. అనధికారికంగానే వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇలాంటి పరిస్థితులలో వంశి వైసీపీ పార్టీలోకి రావడం యార్లగడ్డ విభేదించడం జరిగింది.
ఈ క్రమంలో వైయస్ జగన్ కొన్నిసార్లు సరిది చెప్పటంతో గన్నవరంలో పరిస్థితి మొన్నటి వరకు బాగానే ఉంది. అయినా గాని వంశీ పట్ల యార్లగడ్డ వెంకట్రావు అసహనంగానే ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం లో వంశీ మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఇదే విషయాన్ని కొడాలి నాని సైతం నిర్ధారించారు. ఈ పరిణామంతో ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు.. పార్టీ మారడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. నీ క్రమంలో వంశీకి వ్యతిరేకంగా దూట్టా రామచంద్ర రావుతో కలసి యార్లగడ్డ పలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే సోమవారం కోర్టు కేసు నేపథ్యంలో అటుగా వెళ్లిన యార్లగడ్డ హనుమాన్ జంక్షన్ లో దూట్టా రామచంద్ర రావుతో.. భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తానే గన్నవరం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి సమాధానం దాటి వేస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరే అర్థం చేసుకోవాలి అని స్పష్టం చేశారు. మరోపక్క గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేకపోవడంతో..యార్లగడ్డ టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు టాక్. ఈ పరిణామంతో గన్నవరంలో వైసీపీలోనే రూపు రాజకీయాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి.
గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఓటి బ్యాంక్ ఉండటంతో యార్లగడ్డ టిడిపిలో జాయిన్ అయితే వైసీపీకి గట్టిగానే డ్యామేజ్ జరగనుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ గ్రూపు రాజకీయాలు నిలువరించాలంటే వైఎస్ జగన్ రంగంలోకి దిగాల్సిందేనని.. వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.